Health tips: కళ్ళ వాపు తగ్గేందుకు నివారణలు!!

చాలామంది కళ్ళ చుట్టూ వాపు సమస్యతో తెగ బాధపడుతూ ఉంటారు, కళ్ళ చుట్టూ వాపు సమస్య కొంతమందికి ఎక్కువగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కనిపిస్తుంది. లేదా విపరీతంగా ఏడ్చిన వారికి కూడా కళ్ళ చుట్టూ వాపు సమస్య వస్తుంది. అయితే చాలామందికి ఈ కళ్ళ చుట్టూ వాపు సమస్య కొద్దిసేపటి తరువాత తగ్గిపోతే మరి కొంతమందికి ఎక్కువసేపు కళ్ళ చుట్టూ వాపు సమస్య ఉంటుంది.

కళ్ళ చుట్టూ వాపు.. నిద్రకు లింక్
ఇక అలాంటివారు సాధారణంగా కళ్ళ చుట్టూ వాపు సమస్య పరిష్కారానికి ఎలాంటి చిట్కాలను పాటించాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కళ్ళ చుట్టూ వాపు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ముఖ్యంగా నిద్ర తక్కువ పోకూడదు. కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవాల్సిన అవసరం ఉంది.

టీ, కాఫీ బ్యాగ్స్ తో కళ్ళవాపు తగ్గుతుంది

Health tips Remedies to reduce swelling of the eyes do this for eyes puffiness reduction

టీ బ్యాగ్ ను కొద్దిగా నీటితో తడిపి దానిని ఫ్రిజ్లో పెట్టి అది గడ్డ కట్టిన తర్వాత కంటి కింద పది నిమిషాలు సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు ఈ టీ బ్యాగ్ ఐస్ క్యూబ్ ను ఉంచితే ఈ ఐస్ క్యూబ్ తో కూడా కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది. కాఫీ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ మసాజ్ చేయడం వల్ల కూడా కళ్ళ వాపు తగ్గుతుంది.

కీరా దోస, ఆలు గడ్డతోనూ కళ్ళవాపుకు చెక్
దీనికి చేయవలసింది నీటిని వేడి చేసి ఒక చెంచా కాఫీ పొడిని దానిలో వేసి మరిగించి ఆ నీరు చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో పోసి భద్రపరుచుకుంటే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆ క్యూబ్స్ తో కళ్ళ చుట్టూ నిదానంగా మసాజ్ చేస్తే కళ్ళ వాపు తగ్గుతుంది.ఒక కీర దోసకాయ ముక్కను కానీ బంగాళాదుంపని గాని కట్ చేసి కళ్ళ పైన కాసేపు పెట్టుకుంటే వాపు సమస్య తగ్గుతుంది.

ఉప్పు తగ్గించండి,.. పాలతో ఇలా చెయ్యండి
చాలామంది ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువ ఉప్పు తీసుకోవడం కూడా కళ్ళ వాపు కు కారణం అవుతుంది ఉప్పు తీసుకోవడం తగ్గించ గలిగితే కళ్ళ వాపు సమస్యను చాలా వరకు నివారించవచ్చు. దూదిని చల్లని పాలల్లో ముంచి కళ్ళ చుట్టూ రాసుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు చేస్తే కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది.

కళ్ళ వాపు ఉంటే ఈ విషయాల్లో జాగ్రత్త
ఇక కళ్ళల్లో లెన్స్ లు పెట్టుకునే వారు కూడా బాగా కళ్ళు వాపు వచ్చి ఉంటే, కళ్ళల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కళ్ళల్లో లెన్సులు పెట్టుకోకూడదు. ఇక కొంతమంది లిక్విడ్ ఐలైనర్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లిక్విడ్ ఐలైనర్ వలన కూడా కళ్ళ వాపు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఐలైనర్ కు బదులుగా పెన్సిల్ ఐ లైనర్ ఉపయోగిస్తే కళ్ళ వాపు సమస్య తగ్గుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+