ఒత్తిడిని తగ్గించే ఈ ఆహారాలతో ... గెట్ రిలాక్స్!!
ప్రస్తుత సమాజంలో ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికి అతిపెద్ద టాస్క్ గా మారింది. ఒత్తిడి కారణంగా మధుమేహం, బిపి తోపాటు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒత్తిడితో రోగాలు
బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని గడపడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అనేక కారణాలతో ఒత్తిడితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోగాల పాలవుతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకునే వారు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు
ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారు చేపలు తినడం మంచిది. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. సాల్మన్, ట్యూనా, మాకెరాల్ వంటి చేపలను తినడం ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారు ఆకుకూరలు కూడా ఎక్కువ తినాలి. బచ్చలి కూర, పాలకూర వంట ఆకుకూరల్లో విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది.
ఒత్తిడి తగ్గించేందుకు డార్క్ చాక్లెట్
ఇందులో ఉండే మెగ్నీషియం ఫోలేట్ న్యూరో ట్రాన్స్మిస్టర్ల ఉత్పత్తిలో పాల్గొంటాయి. దీంతో మనకు ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు డార్క్ చాక్లెట్ తినడం మంచిది. డార్క్ చాక్లెట్లో 70% కంటే ఎక్కువగా కోకో ఉంటుంది ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడితో బాధపడేవారు అవకాడో తినడం మంచిది. అవకాడో లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్ విటమిన్ బి నాడీ వ్యవస్థను బలపరిచి ఒత్తిడిని తగ్గిస్తాయి.
డ్రై ఫ్రూట్స్ తో ఒత్తిడి తగ్గుతుందా
ఒత్తిడితో బాధపడేవారు బెర్రీస్ తింటే ఒత్తిడి నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఆక్సికరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడేవారు బాదంపప్పు, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు, ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఒత్తిడి నుండి రిలాక్స్ కావాలంటే ఇవి తాగండి
ఇక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలనుకునే వారు పెరుగు తినడం మంచిది. ఇందులో ఉండే ప్రోబయాటిన్స్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి దీని కారణంగా కూడా మనకు ఒత్తిడి తగ్గుతుంది. ఇక గ్రీన్ టీ లో ఎల్ థయమిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మన శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది గ్రీన్ టీ తాగితే కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. కనుక విపరీతమైన స్ట్రెస్ తో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించే ఈ ఆహారాలను పానీయాలను ట్రై చేయండి ఆపై రిజల్ట్ మీరే చూడండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications