health tips: ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే ఎలాంటి షార్ట్ కట్ లు ఉండవు!!
చాలామంది ఆరోగ్యంగా ఉండాలని ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ అందుకు కావలసిన జీవన విధానాన్ని మాత్రం అనుసరించరు. ఫలితంగా అనారోగ్యం బారిన పడతారు. ఆరోగ్యం కోసం ఏం చేసినా అది షార్ట్ టర్మ్ మాత్రమే చేస్తారు. కొద్ది రోజులు జిమ్ చేయడం, కొద్ది రోజులు యోగ చేయడం, కొద్దిరోజులు డైట్ ఫాలో చేయడం.. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే, శారీరకంగా ఫిట్ గా ఉండాలంటే క్రమబద్ధమైన జీవన విధానం ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆరోగ్యం కోసం ఎటువంటి షార్ట్ కట్ లు ఉండవు. కచ్చితంగా ఎప్పుడు పాటించవలసిన నియమాలే ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. గంటసేపు వ్యాయామం చేయడం కుదరకపోతే కనీసం అరగంట సేపైనా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.

క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. సమయం ప్రకారం ఆహారాన్ని తినాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం మంచిది కాదు. సమయం ప్రకారం మంచి పౌష్టికాహారాన్ని తినాలి. ఆన్ని పోషకాలు ఉన్న ఆహారంపై అవగాహన ఉండాలి. అలాంటి ఆహారమే తీసుకోవాలి.
కచ్చితంగా ఎనిమిది గంటలు ప్రతిరోజు నిద్రపోవాలి. శరీరానికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి, కావలసినంత విశ్రాంతినిచ్చి అవసరమైనంత శ్రమ చేసినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఫిజికల్ గా ఫిట్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగాను, ఫిట్ గాను ఉండాలి అనుకునేవారు జిమ్ లని, ఏరోబిక్స్ అని పరుగులు పెట్టకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడాన్ని అలవర్చుకోవాలి.
ఏది చేసినా అది జీవితంలో భాగం కావాలి. ఇక వ్యాయామం చేయలేము అనేవారు తప్పనిసరిగా రోజుకు పదివేల అడుగులు నడిచి తీరాలి. ఈ పని ఎవరైతే చేస్తారో వారు తప్పనిసరిగా బరువు తగ్గుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఫిజికల్ గా ఫిట్ గానూ ఉంటారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications