health tips: ఈ చెడు అలవాట్లు మీ శృంగార జీవితాన్ని నాశనం చేస్తున్నాయి; తెలుసుకోండి!!
చాలామంది ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా రకరకాల చెడు అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం మాత్రమే కాకుండా, శృంగార జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఏకాంతంగా గడిపే శృంగార జీవితాన్ని కూడా వారు ఎంజాయ్ చేయలేక పోతున్నారు. అనేక కారణాల వల్ల పురుషులు లైంగిక శక్తిని కోల్పోతున్నారు.
ప్రస్తుత సమాజంలో పురుషులలో సెక్స్ సామర్ధ్యం బాగా తగ్గుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పురుషులలో బాగా తగ్గిపోతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పడిపోతుంది. అసలు పురుషుల్లో సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? శృంగార జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయలేకపోతున్నారు? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కొన్ని చెడు అలవాట్లు లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. చాలా మంది పురుషులు ఆల్కహాల్ సేవిస్తున్నారు. అధిక మొత్తంలో ఆల్కహాల్ నిరంతరం తాగడం వల్ల పురుషులలో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందని, స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని అనేక అధ్యయనాలు తెలిపాయి. అంతే కాదు చాలా మంది పురుషులు అసలే వ్యాయామం చేయరు. వ్యాయామం చేయకపోవడం వల్ల వారు ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం సమస్యతో బాధపడేవారు కూడా శృంగార సామర్థ్యం కోల్పోతారని చెబుతున్నారు.
చాలామంది పురుషులు తాము ఫిట్ గా ఉండాలి అన్న భావనతో అతిగా వ్యాయామం చేస్తారు. అతిగా వ్యాయామం చేసే వారిలో కూడా సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గిపోతుందని చెబుతున్నారు. డిప్రెషన్ మరియు ఒత్తిడి ఎక్కువగా ఉంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఇది సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని నిరంతరం తీసుకోవడం వల్ల, ఆయిల్ ఫుడ్స్ శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుందని అంటున్నారు.
దీనివల్ల పురుషుల సంతానోత్పత్తికి గణనీయంగా పడిపోతుందని చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరిగి సెక్స్ సామర్థ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ చెడు అలవాట్లను దూరం చేసుకుంటే శృంగార సామర్థ్యం పెరుగుతుందని, సంతానోత్పత్తి, స్పెర్మ్ కౌంట్ బాగా ఉంటుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications