Health tips: ఈ ఆహారాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి!!
ఇప్పుడు చాలామంది చెడు కొలెస్ట్రాల్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏది పడితే అది తినడం, శారీరక వ్యాయామం లేకపోవడం, తీసుకునే ఆహారాలు చెడు కొవ్వును పెంచే ఆహారాలని తీసుకోవడం వంటి అనేక కారణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతున్నాయి. శరీరంలో ఉండవలసిన మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి, ఉండకూడని చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.
మన శరీరంలో హెచ్ డి ఎల్ మంచి కొలెస్ట్రాల్ గాను, ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ గాను ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు అనేక అనారోగ్య సమస్యలను, గుండె జబ్బులను ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు రక్తంలోనూ కొవ్వు చేరి ట్రై గ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఈ ట్రై గ్లిజరైడ్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.

ఆహారంలో మార్పులు చేయడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులను పెంచి అనారోగ్యకరమైన కొవ్వును తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను శరీరంలో తగ్గించుకోవాలనుకునేవారు అల్పాహారంగా ఓట్ మీల్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే బీన్స్ ను తరచూ ఆహారంలో తీసుకోవాలని, బీన్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అవి తీసుకున్న తర్వాత జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ సమయం తీసుకుంటుందని, భోజనం చేసిన తర్వాత ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందని చెబుతున్నారు. బాదం, వాల్ నట్స్, వేరుశనగ గింజలు, ఇతర తృణధాన్యాలు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అంటున్నారు.

ఇక ఆకుకూరలను తీసుకోవడం కూడా చెడు కొవ్వును తగ్గిస్తుందని చెబుతున్నారు . వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుందని, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే ఒమేగా త్రీ కొవ్వులను చేపలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. ఒమేగా త్రీ ఉన్న చేపలను తినడం వల్ల ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
స్పైసీ 'గోంగూర పన్నీర్ కర్రీ'.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..! -
"టమాటా - ఎండు చేపల కూర" ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ కావాల్సిందే..! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications