health tips: తమలపాకులను వీరు అస్సలే తినకూడదు
చాలామంది ప్రతిరోజూ తమలపాకులను తింటూ ఉంటారు. తమలపాకులు చాలామంది ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. తమలపాకులను తింటే ఆహారం జీర్ణం అవుతుందని, జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తారు. అది వాస్తవమే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు తమలపాకులను తినకూడదని సూచిస్తున్నారు.
తమలపాకులను వీరు తినకూడదు
ముఖ్యంగా ఆరు రకాల సమస్యలతో బాధపడుతున్నవారు తమలపాకులను తినకూడదు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇవి ఏమాత్రం మంచిది కాదు. అదేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ చెమట పట్టేవారు తమలపాకులను తినకూడదు.

బీపీ, షుగర్ ఇలా ఉంటే తమలపాకులు తినకూడదు
అంతేకాదు రక్తంలో చక్కెర తక్కువ ఉన్నవారు తమలపాకులను వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి. వారు తినకుండా ఉంటేనే మంచిది. కొన్నిసార్లు రక్తపోటు తక్కువగాను, మరికొన్నిసార్లు రక్తపోటు ఎక్కువగా ఉండేవారు తమలపాకులను రోజు తినకూడదు. దంతాలు పసుపు రంగులో ఉన్నవారు తమలపాకులను తినకూడదని చెబుతారు. ఎందుకంటే తమలపాకులను తింటే దంతాలు మరింత పసుపు పచ్చ గాను, వికారంగా తయారవుతాయి .
హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికితమలపాకులు డేంజర్
మహిళలు ఎక్కువగా తమలపాకులను తీసుకుంటే ఈస్ట్రోజన్ హార్మోను ఉత్పత్తి తగ్గుతుంది. అటువంటి సమయంలో మహిళలలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి మహిళలు ఎక్కువగా తమలపాకులను తినకూడదు. తమలపాకులో ఉండే రసాయన పదార్థాలు ఔషధానికి ప్రతిస్పందించి శరీరానికి హాని కలిగించే అవకాశం ఉన్న కారణంగా ఏదైనా అనారోగ్యానికి లేదా ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారు తమలపాకులను తినకుండా ఉండాలి.
తమలపాకులను పరిమితంగా ఆరోగ్యవంతులు తీసుకోవాలి
సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు తమలపాకులను పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తమలపాకులలో పొగాకు పదార్థాలు వంటివి కలపకూడదు. తమలపాకును ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకొని వాటిని పరిమిత పరిమాణంలో ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications