health tips: 90శాతం రోగాలకు మూల కారణం ఇదే.. జాగ్రత్త!!

ఈ రోజుల్లో చిన్న వయసులోనే పెద్దపెద్ద రోగాల బారిన పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. 20 నుంచి 30 సంవత్సరాల వయసులోపు ఉన్న వారిలో కూడా మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్, ఫ్యాటీ లివర్ వంటి అనేక వ్యాధుల లక్షణాలు కనిపిస్తున్నాయి. చాలామంది రోగులకు వ్యాధి ప్రారంభమవుతుందన్న విషయం కూడా తెలియడం లేదు. వ్యాధి ముదిరి పరిస్థితి తీవ్రంగా మారినప్పుడు చికిత్స చేయడం కూడా కష్టతరమవుతుంది.

అయితే ఈ వ్యాధులను నివారించడానికి ఒక సులభమైన మార్గము ఉంది. వ్యాధులకు కారణమైన వాటికి దూరంగా ఉంటే సగం జబ్బులు రాకుండా ఉంటాయి.అసలు జబ్బులు అన్నింటికి మూల కారణం జీవనశైలి. 90 శాతం జబ్బులు జీవన శైలి వల్లనే వస్తాయి. మిగిలిన 10 శాతం వ్యాధి జన్యుపరంగా వస్తుంది. అది కుటుంబ చరిత్ర నుండి వస్తుంది.

health tips: This is the root cause of 90 percent of diseases.. Be careful!!

జీవనశైలి మీ ఆరోగ్యం పై అత్యధిక ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ రోజువారి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు అన్నదానిపై మీ ఆరోగ్యం నిర్ణయించబడి ఉంటుంది. ఇందులో మీరు ఏమి తింటున్నారు? ఎంత వ్యాయామం చేస్తున్నారు? ఎటువంటి టాక్సిన్స్ కు గురవుతున్నారు? వాటి నుంచి బయటపడడానికి ఏం చేయాలి? వంటి వివరాలను తెలుసుకోవాలి.

జీవన శైలిని మెరుగుపరచడానికి ముందుగా ఆహారంపై దృష్టి సారించాలి. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను అందించే ఆహారాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్, అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు, మరియు అదనపు ఉప్పును పూర్తిగా నివారించాలి. ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా అవసరం.

యోగ, వ్యాయామం మధుమేహం, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల నుండి దూరంగా ఉంచడమే కాకుండా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా మొక్కలు మరియు జంతువులు విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఒక్కోసారి మన శరీరానికి ప్రాణాంతకంగా మారుతాయి. వాటి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. సిగరెట్లు, పొగాకు మరియు ఆల్కహాల్ లో విషపదార్థాలు పెద్ద మొత్తంలో ఉంటాయి వీటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అని భావించేవారు సహజమైన, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను ఉపయోగించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+