health tips: మోకాలినొప్పికి ఈ చిట్కాలు ట్రై చెయ్యండి.. ఈ పని అస్సలు మర్చిపోవద్దు!!
ప్రస్తుత సమాజంలో మోకాలినొప్పి అతి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకల్లో క్షీణత కారణంగా మోకాలినొప్పి ప్రమాదం కూడా పెరుగుతుంది. భారత దేశంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష 20 వేల మంది మోకాలి మార్పిడి ఆపరేషన్ లు చేయించుకుంటున్నారు అంటే ఎంత ఎక్కువగా మోకాలి సమస్య వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అయితే మోకాలు నొప్పి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మోకాలు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది? వంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మోకాలు నొప్పి నుండి బయటపడటానికి వ్యాయామం మంచి ప్రత్యామ్నాయం. నొప్పిని తగ్గించుకోడానికి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకున్నా అవి తాత్కాలిక ఫలితాన్నిస్తాయి. అదే కష్టమైనా వ్యాయామం చేస్తే మోకాలు నొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది.

సాధారణంగా మోకాలు నొప్పిని తగ్గించడానికి మోకాలి చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తే సరిపోతుంది. మోకాలు నొప్పి గా ఉందని కాలును పూర్తిగా చాచకపోతే నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి శశాంకాసనం, నౌకాసనం ఎంతగానో ఉపయోగపడతాయి. శశాంకాసనం తో వెన్నెముక సాగి, మెదడు విశ్రాంతి పొంది మోకాళ్లు బలపడతాయి. అలాగే నౌకాసనం తో మోకాళ్ళ కండరాలు బలోపేతమై బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
ఇక మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. కొబ్బరినూనెలో ముద్ద కర్పూరం కలిపి ప్రతి రోజూ రెండు మూడు సార్లు మోకాలికి మర్దనా చేస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు అర టీ స్పూన్ మిరియాలు, టీస్పూను జీలకర్ర, టీ స్పూను మెంతులను కలిపి మెత్తని పిండిలా చేసి ఆ పిండిని ప్రతి రోజూ ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగితే మోకాలు నొప్పి తగ్గుతుంది.
ఈ పొడితో కండరాలు బలపడతాయి. ఇరవై రోజుల నుండి రెండు నెలల పాటు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కనుక మోకాలు నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వ్యాయామంతో పాటు, ఒక క్రమపద్ధతిలో ఈ రెమిడీస్ ని పాటించి చూడండి. వ్యాయామాన్ని మాత్రం ప్రతి రోజూ అసలు మర్చిపోకుండా చేయండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications