భరించలేని కీళ్ళ నొప్పులు ఈ సూపర్ ఫుడ్స్ తో తగ్గుతాయి!!
ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు చిన్నవయసులోనే చాలామందిని కీళ్ల నొప్పుల బారిన పడేస్తున్నాయి. అయితే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ఆహారాలు తింటే కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కీళ్ళ నొప్పులకు సూపర్ ఫుడ్స్
కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్ ఫుడ్స్ గా బెర్రీస్ ను చెప్పుకోవచ్చు. స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు, బ్లూబెర్రీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను తగ్గించే వాటిలో పసుపు కూడా చాలా ముఖ్యమైనది.. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు వాపును తగ్గించే లక్షణాలు కలిగి ఉంటుంది. కీళ్లనొప్పి, కండరాలు పట్టేయడం, వాపులను తగ్గించడంలో పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

ఈ ఆహారాలతో కీళ్ళ నొప్పుల నుండి రిలీఫ్
కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం చాలా బాగా పనిచేస్తుంది.యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కలిగిన అల్లంలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. ఇది కండరాల నొప్పులను, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఆకుపచ్చని ఆకుకూరలు తింటే మంచిది. ఆకుకూరల్లో అనేక పోషకాలు ఉంటాయి. పాలకూర, బచ్చలి కూర, బ్రోకలీ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు కూడా ఉంటాయి.
కీళ్ళ నొప్పులకు ఇవి దివ్యౌషధం
కీళ్ల నొప్పులను తగ్గించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. వర్షాకాలంలో దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉత్తేజం కూడా కలుగుతుంది ఇక కీళ్ల నొప్పులను తగ్గించే దివ్య ఔషధంగా వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. కీళ్లల్లో రక్త ప్రవాహాన్ని చక్కబెడతాయి. కండరాలు పట్టెయ్యకుండా చూస్తాయి.
డ్రై ఫ్రూట్స్, సీడ్స్ తో కీళ్ళ నొప్పుల నుండి రిలీఫ్
కీళ్ల నొప్పులను తగ్గించడానికి డ్రై ఫ్రూట్స్ అలాగే గింజలు చాలా బాగా పనిచేస్తాయి. డ్రై ఫ్రూట్స్ , సీడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్లు కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలతో ఉంటాయి. వాల్నట్స్, చియా సీడ్స్, అవిసె గింజల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. తృణధాన్యాలలో కూడా కీళ్ల నొప్పులను తగ్గించే పోషకాలు ఉంటాయి.
పప్పులు, ధాన్యాలు కీళ్ళ నొప్పులకు బెస్ట్ ఫుడ్
పప్పులు, ధాన్యాలలో అధికంగా ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి కండరాలకు కావలసిన పోషకాలను అందిస్తాయి. వాటి పనితీరు మెరుగుగా ఉండేలా చేసి వాపులు, నొప్పులు రాకుండా చేస్తాయి. చేపలలోను కీళ్ల నొప్పులను తగ్గించే గుణాలు ఉన్నాయి. సాల్మన్ సార్డినెస్, మాకేరెల్, ట్యూనా చేపలలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండడం వల్ల ఇవి జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications