Health tips: రాత్రి పడుకునే ముందు పాదాలు కడుక్కుని పడుకోండి.. జరిగే మిరాకిల్స్ చూడండి!!
ప్రతిరోజు నిద్రకు ఉపక్రమించే ముందు హాయిగా నిద్ర పోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించాలని చెబుతున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు మన శరీర భాగాలైన పాదాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు.
రాత్రి పడుకునే ముందు పాదాల శుభ్రత
రోజంతా కష్టపడి పనిచేసే రాత్రి ప్రశాంతంగా హాయిగా నిద్ర పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే పడుకునే ముందు పాదాల విషయంలో చేసే ఒక చిన్న పని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, మీకు ప్రశాంతమైన నిద్రను ఇస్తుందని చెబుతున్నారు. పడుకునే ముందు ప్రతిరోజు పాదాలను శుభ్రం చేసుకోవడం వల్ల, నీళ్లతో కడగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

గోరువెచ్చని నీటితో పాదాలను కడిగితే రిలీఫ్
రోజంతా నిలబడి ఉన్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు శరీరం యొక్క మొత్తం బరువు మన పాదాల మీదనే పడుతుంది. దీని కారణంగా పాదాలలో రాత్రి అయ్యేసరికి విపరీతమైన దృఢత్వం, నొప్పి వస్తాయి. అయితే రాత్రి పడుకునే ముందు పాదాలను కాస్త గోరువెచ్చని నీళ్లతో కడిగితే పూలు కండరాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
ఆందోళన నుండి కూడా శరీరం రిలాక్స్
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలను కొద్దిసేపు నీళ్లలో పెట్టి కడుక్కోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందని, ఇలా చేయడం వల్ల మెదడుకు విశ్రాంతి లభించి మంచి నిద్ర వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఒక టబ్లో నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ ను వేసి కొద్దిసేపు పాదాలను టబ్ లో పెట్టి చూడడం వల్ల శరీరం రిలాక్స్ గా ఉంటుందని ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
పాదాలను చల్లని నీటితో కానీ, గోరువెచ్చని నీటితో కానీ కడుక్కోవాలి
రోజంతా బూట్లు వేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది పాదాలు వాసన వస్తాయని ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి కూడా పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి అని చెబుతున్నారు. అంతేకాదు చల్లని నీళ్లతో కానీ, గోరువెచ్చని నీళ్లతో కానీ పాదాలను కడుక్కోవటం మంచిదని చెబుతున్నారు.
పాదాలను ఒక టబ్ లో 15 నిముషాలు ఉంచితే రిలీఫ్
ఒక బకెట్లో కానీ టబ్ లో కానీ కాళ్ళను పెట్టి అందులో 15 నిమిషాల పాటు పాదాలను ఉంచి, ఆ తరువాత పాదాలను తీసివేసి ఒక పొడి గుడ్డతో శుభ్రంగా తుడిచి పాదాల రక్షణ చేపట్టాలని, అప్పుడు అనేక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications