కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు చికెన్ తింటే ఏమవుతుంది?
ప్రస్తుత సమాజంలో కొలెస్ట్రాల్ అన్నది అతిపెద్ద సమస్యగా మారింది. చిన్న పిల్లలు కూడా కొలెస్ట్రాల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మన జీవనశైలి, మనం తీసుకునే ఆహారం, ముఖ్యంగా మనం కల్తీ ఎక్కువగా ఉండే నూనెలను వాడడం, అధిక నూనెల వినియోగం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్ల కారణంగా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా ఊబకాయం, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణాలు సంభవిస్తున్నాయి.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నాన్ వెజ్ తినకూడదా?
ఇక అత్యంత తీవ్రమైన సమస్యగా మారిన కొలెస్ట్రాల్ సమస్య మాంసాహారం తినేవారిలో ఇంకా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అయితే అందులో వాస్తవం ఎంత? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు మాంసాహారం తినకూడదా? కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు చికెన్ మటన్ వంటి నాన్వెజ్ తింటే ఏమవుతుంది? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఏది తిన్నా వండుకు తినే విధానం బట్టే కొలెస్ట్రాల్
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు మటన్ తినడం మంచిది కాదు. మటన్ ఎక్కువగా తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. ఇక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు చికెన్ తినొచ్చా అంటే కొంతమేరకు తినొచ్చు అని చెప్పొచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం మనం ఏది తిన్నప్పటికీ దానిని వండుకు తినే విధానాన్ని బట్టి మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. తగ్గుతుందా అన్నది ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు.
చికెన్ ఇలా తింటే మంచిది కాదు
చికెన్ తినే విషయంలో చికెన్ ఉడికించి తింటే అది మన శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తుంది. అలా కాకుండా చికెన్ ఎక్కువ నూనెలో వండితే అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు చికెన్ ను ఉడికించుకుని మాత్రమే తినాలి. చికెన్ ఫ్రైలు, కడాయి చికెన్, బట్టర్ చికెన్, డీప్ ఫ్రై వంటి వాటిని తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది.
చికెన్ ఇలాగే తినాలి
ఎవరైతే చికెన్ ను అతి తక్కువ నూనెలో ఉడకబెట్టుకొని తింటారో లేదా సూప్ గా చేసుకొని తాగుతారో వారికి కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. అంతేకాదు బొగ్గుపై కాల్చిన బార్బీ క్యూ చికెన్ వంటివి తిన్న తందూరి చికెన్ తిన్న ఆరోగ్యానికి హాని ఉండదు. అలా అని ఇష్టం వచ్చినట్టు ప్రతిరోజు ఎంత పడితే అంత చికెన్ తినడం మాత్రం మంచిది కాదు.
చికెన్ తినాలనుకుంటే ఈ టిప్స్ మర్చిపోవద్దు
ఏ ఆహారం తీసుకోడానికైనా ఒక నియమం ఉంటుంది. దానిని పరిమితంగా తీసుకున్నప్పుడే దాని ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఏదైనా అతిగా తింటే అనారోగ్యమే వస్తుంది. కనుక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు చికెన్ తినాలి అనుకుంటే వారానికి ఒకసారి అతి తక్కువ నూనెతో వండుకుని తింటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. అలా కాకుండా డీప్ ఫ్రై చేసుకుని తిన్నారో మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మీకు డేంజర్ బెల్ మోగిస్తుంది. అందుకే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మాంసాహారం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.












Click it and Unblock the Notifications