Health tips: బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ చెయ్యటానికి అనువైన సమయం ఎప్పుడంటే!!

ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది సమయానికి భోజనం చేయడం మానేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారం చెయ్యటానికి, మధ్యాహ్నం భోజనం చెయ్యటానికి, రాత్రి డిన్నర్ చెయ్యటానికి కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ప్రకారం తింటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అవి అందరూ మర్చిపోతున్నారు. కుదిరినప్పుడు ఏదో ఒకటి తినటం అన్నట్టు పరిస్థితి మారింది.

నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి భోజనం చేసేవరకు నియమిత సమయంలోనే తినేవారు లేకుండా పోయారు. సరైన సమయానికి ఆహారం తినకపోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చాలా మంది ఉదయం చెయ్యాల్సిన బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ సమయంలో చేస్తూ ఉంటారు. దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.సరైన సమయంలో తినకపోవటం వల్ల గ్యాస్ , అజీర్ణం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

Health tips

అందుకే ఉదయం అల్పాహారం 7 గంటల నుండి 8 గంటల మధ్య తినాలి. పొరబాటున కూడా 10గంటల తర్వాత అల్పాహారం తినకూడదు. బ్రేక్ ఫాస్ట్ కు లంచ్ కు మధ్య 4 గంటల గ్యాప్ ఉండాలి. ఇక మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య తినాలి.

సాయంత్రం నాలుగు గంటల తర్వాత లంచ్ తినకూడదు. ఇదే సమయంలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో రాత్రి భోజనం చెయ్యాలి. పొరబాటున కూడా రాత్రి 10 గంటల తర్వాత రాత్రి భోజనం చెయ్యకూడదు.రాత్రి భోజనం రాత్రి నిద్రించటానికి మూడు గంటల ముందు తినాలి.ఈ సమయం ఆహారం జీర్ణం కావటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అసలు ఆహారం తినటం మంచిది కాదు. ఆహారం విషయంలో సమయ పాలన పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయాల్లో నిత్యం క్రమం తప్పకుండా భోజనం చేసి చూడండి, ఆపై మీ ఆరోగ్యంలో మార్పు మీరే చూడండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+