Health tips: ఎవరు రక్తదానం చేయవచ్చు? ఎవరు చెయ్యకూడదు? తెలుసుకోండి!!
రక్తదానం చేయడం అనేది మహత్తరమైన కార్యం. రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానం. రక్తదానం చేసే వ్యక్తికి మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకోవడం మంచిది. దీనిని పరిగణనలోకి తీసుకుని రక్తదానం చేసే వ్యక్తిని నిర్ణయిస్తారు. చాలాసార్లు చాలామంది తాము రక్తదానం చెయ్యలేము అనే విషయం తెలీదు.. కానీ రక్తదానం చేయడానికి వెళుతూ ఉంటారు. అయితే రక్తదానం ఎటువంటి వారు చేయాలి? ఎవరు రక్తదానం చెయ్యకూడదు? ఇక్కడ తెలుసుకుందాం.
18 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు లేదా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు రక్తదానం చెయ్యకూడదు. పిల్లలకు పాలిచ్చే తల్లులు రక్తదానం చెయ్యకూడదు. హిమోఫీలియా వ్యక్తి రక్త దానం చేయకూడదు. బిపి, మధుమేహం ఉన్న రోగులు రక్తదానం చెయ్యకూడదు. హిమోఫిలియా ఉంటే రక్తదానం చెయ్యకూడదు.

49 కిలోల కంటే తక్కువ బరువు ఉంటే రక్తదానం చెయ్యకూడదు. హెపటైటిస్ బి బాధితులు రక్తదానం చెయ్యకూడదు. టాటూ వేసుకున్న వాళ్ళు రక్తదానం చెయ్యకూడదు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి 12.5 శాతం కంటే తక్కువగా ఉంటే రక్తదానం చెయ్యకూడదు. రక్తపోటు సిస్టాలిక్ 140 కంటే ఎక్కువగా, డయాస్టాలిక్ 90 కంటే ఎక్కువగా ఉంటే రక్తదానం చెయ్యకూడదు.
కామెర్లు వచ్చిన వారి నుండి సంవత్సరం లోపు, టైఫాయిడ్ వచ్చిన వారి నుండి 6 నెలల లోపు, మలేరియా వచ్చిన వారి నుండి మూడు నెలల లోపు రక్తం తీసుకోకూడదు. మేజర్ సర్జరీ చేయించుకున్న వారు ఏడాది లోపు రక్తం ఇవ్వకూడదు. ఎక్కువగా ఆల్కహాల్ తాగే వారు, ధూమపానం చేసేవారు రక్తదానం చెయ్యకూడదు. ఆరోగ్యంగా ఉన్నవారు, యాంటీబయోటిక్స్ మందులు ఉపయోగించకుండా ఉన్నవారు రక్త దానం చేయొచ్చు.
తీవ్రమైన వ్యాధులు లేని వారు రక్త దానం చేయొచ్చు. రక్తదానం చెయ్యాలి అనుకునేవారు రక్తదానం చేసే ముందు ఏమైనా మందులు వాడుతున్నట్లయితే ఆ మందుల వివరాలు ఖచ్చితంగా వైద్యులకు తెలియజేయాలి. అత్యవసరం అయిన తరుణంలో రక్తం ఇవ్వాలని వెళ్ళేవాళ్ళు ఈ నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడు వైద్యుల సమయం, మీ సమయం వృధా కాకుండా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications