health tips: యవ్వనంగా ఉండాలని ఎవరు కోరుకోరు.. యవ్వనం కోసం ఇవి చెయ్యండి!!

చాలామంది చిన్న వయసులో ఉన్నప్పటికీ వృద్ధాప్యం వచ్చినట్టుగా చర్మం ముడతలు పడి పెద్ద వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే కొన్ని చెడు అలవాట్ల వల్ల చాలామంది చిన్న వయసులోనే ముసలి వారిగా మారుతున్నారు. సరైన జీవన శైలి లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం ఎంతోమందిని ముసలి వారిగా మారుస్తుంది.

యవ్వనం శాశ్వతంగా ఉండాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు. కానీ తెలిసీ తెలియక అలవాటుగా మారిన కొన్ని చెడ్డ అలవాట్ల వల్ల చాలా మందికి చిన్న వయసులోనే యవ్వనం పోయి ముసలితనం వస్తుంది. ఇక అలాంటి అలవాట్ల విషయానికి వస్తే చాలామంది ఆహార నియమాలను పాటించరు. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది పట్టించుకోరు. స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ముసలితనం వస్తుంది. ఈ అలవాటును మార్చుకోవాలి.

health tips: Who doesnt want to stay young.. Do these things to look young!!

ప్రతిరోజు ఆకుకూరలు, కూరగాయలు బచ్చలికూర, బ్రోకలీ, బీన్స్, దుంపలు తినడం వల్ల వృద్ధాప్యం దరిచేరదు. మనం తీసుకునే ఆహారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. యాపిల్స్, పుట్టగొడుగులు, బాదం, ఆలివ్ నూనె తదితర ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమై యవ్వనంగా కనిపిస్తారు.

రోజువారి ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా యవ్వనంగా ఉంటారు. చేపలు, మాంసం వంటివి తగినంత మోతాదులో తినడం వల్ల యవ్వనంగా ఉంటారు. ఇక చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉండాలి అంటే ఎక్కువ నీటిని తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిస్తుంది.

ప్రతిరోజు ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయం నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర వల్ల శరీరంలోని కణాలు రిపేర్ చేయబడి యవ్వనంగా కనిపిస్తారు. యవ్వనంగా ఉండాలి అనుకునే వారు ప్రతిరోజు తప్పనిసరిగా కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. ఆల్కహాల్, సిగరెట్లు అలవాటు త్వరగా వృద్ధులు అయ్యేలా చేస్తాయి. ఈ అలవాట్లు ఉన్నవారు తక్షణం మానుకోవాలి. అప్పుడే వయసును మించిన వృద్ధాప్యం నుండి బయటపడతారు. యవ్వనంగా కనిపిస్తారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+