health tips: బరువు తగ్గేందుకు జ్యూస్ డైట్.. ప్రయత్నించండి!!

బరువు తగ్గాలనుకునే వారు జ్యూస్ డైట్ ప్లాన్‌తో బాగా బరువు తగ్గొచ్చు.. ట్రై చెయ్యండి

చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు డైట్ తో బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తే, మరికొందరు జిమ్ లకు వెళ్లి బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు ప్రోటీన్ డ్రింక్స్ తో బరువుకి చెక్ పెట్టాలని చూస్తారు. ఇక వాకింగ్ లు, జాగింగ్ లు, ఏరోబిక్స్ ఇలా ఒకటేమిటి.. బరువు తగ్గటం కోసం మనం చెయ్యని పని ఉండదు. అయితే బరువు తగ్గాలని భావించేవారు శారీరక వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు.

బరువు తగ్గే జ్యూస్ డైట్

బరువు తగ్గే జ్యూస్ డైట్

వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్, నిమ్మరసం తేనె వంటి వాటితో కూడా బరువు తగ్గొచ్చని ఇప్పటికే అనేకమంది చెప్పి ఉన్నారు. ఇక చిరు ధాన్యాల డైట్ ఫాలో చెయ్యమని కూడా చాలా మంది చెప్తారు. ఇక తాజాగా జ్యూస్ డైట్ తో కూడా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఎటువంటి ఆహారము తీసుకోకుండా నిత్యం జ్యూస్ లతో బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అయితే ఏ సమయానికి ఏ జ్యూస్ తీసుకోవాలి? అవి మన శరీరంపై ఏ విధంగా పనిచేస్తాయి? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

జ్యూస్ డైట్ చెయ్యండి ఇలా

జ్యూస్ డైట్ చెయ్యండి ఇలా

పండ్ల రసాలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే పండ్లను నేరుగా జ్యూస్ చేసుకుని, ఎటువంటి ఐస్ లేకుండా, చక్కెర వేసుకోకుండా తాగితేనే వాటి ప్రయోజనం ఉంటుంది. రకరకాల పండ్ల రసాలతో.. ఆకుకూరల జ్యూస్ లతో కూడా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. దానికోసం జ్యూస్ డైట్ ని కూడా రూపొందించి కొంతమంది పాటిస్తున్న పరిస్థితి ఉంది. ఇక బరువు తగ్గడం కోసం చాలామంది పాటిస్తున్న జ్యూస్ డైట్ మీకోసం..

ప్రతీ రోజూ జ్యూస్ డైట్ ఇలా

ప్రతీ రోజూ జ్యూస్ డైట్ ఇలా

ఉదయం 6 గంటలకు కొత్తిమీర జ్యూస్ లో ఒక అరచెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. దీనివల్ల వారం రోజుల్లో బరువులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు ఒక గ్లాసు బత్తాయి రసం, మధ్యాహ్నం ఒంటిగంటకు రెండు గ్లాసులు బొప్పాయి జ్యూస్ తీసుకోవాలి. ఆపై సాయంత్రం నాలుగు గంటలకు ఒక గ్లాసు కమలాపండ్ల రసం, రాత్రి 8 గంటలకు కీర దోసకాయ జ్యూస్ తీసుకోవాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మజ్జిగ తాగి పడుకుంటే సరిపోతుంది.

జ్యూస్ డైట్ తో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

జ్యూస్ డైట్ తో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది

జ్యూస్ లు మినహాయించి ఎటువంటి ఘనపదార్థాన్ని, ఇతర ఆహారాన్ని తీసుకోకుండా, ఈ డైట్ ను పాటించగలిగితే గణనీయంగా బరువు తగ్గుతారని, మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ జ్యూస్ డైట్ వల్ల పొట్ట మొత్తం శుభ్రం అవుతుందని, మన మెటబాలిక్ రేట్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. జీర్ణశక్తి పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఫలితంగా ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు.

జ్యూస్ డైట్ పాటించేవారు ఈ విషయం అసలే మర్చిపోకండి

జ్యూస్ డైట్ పాటించేవారు ఈ విషయం అసలే మర్చిపోకండి

ఇక విపరీతంగా ఒబేసిటీతో బాధపడేవారు, ఆరోగ్యంగా బరువు తగ్గాలని ఆలోచిస్తున్నవారు ఈ జ్యూస్ డైట్ ను కూడా పాటించి చూడండి. అయితే పొరబాటున కూడా అందులో చెక్కెర వేసుకోకూడదు అన్నది గుర్తు పెట్టుకోవాలి. ఇక ఈ జ్యూస్ డైట్ ను ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా డైటీషియన్ల సలహా తీసుకొని మాత్రమే పాటించాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+