Health tips: ఈ అలవాట్లతో బరువు తగ్గరు.. జాగ్రత్త!!
ఊబకాయం.. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య .ఈ ఊబకాయం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారు ఏ పని సక్రమంగా చేసుకోలేరు. ఊబకాయం సమస్య వచ్చినప్పుడు దానితోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే బరువు తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటామని భావించి, బరువు తగ్గే క్రమంలో కొన్ని పొరపాట్లు చాలామంది చేస్తూ ఉంటారు.
ఎక్కువ మందికి ఉదయం లేవగానే కాఫీ టీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ, టీ తాగడంతో మూత్ర రూపంలో నీటిని శరీరం బయటకు పంపిస్తుంది. దీంతో త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతారు. దీనివల్ల జీవక్రియల పనితీరు కూడా మందగిస్తుంది. బరువు తగ్గాలని భావించేవారు కాఫీ, టీ మానుకుంటే మంచిది. కాఫీ టీ మానుకో లేకపోతే బరువు తగ్గరు. కాఫీ టీలకు బదులు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగాలి.

దీనివల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతుంది .కొంతమంది ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తింటారు. దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కడుపు నిండిన భావన కలగదు. ఒక స్వీట్స్, చక్కెరతో చేసిన పదార్థాలు తింటే బరువు పెరుగుతారు. కార్బోహైడ్రేట్లను కాకుండా ప్రోటీన్లను ఆహారంగా తీసుకోవాలి.
గుడ్లు, పాలు, ఓట్స్, పండ్లు, నట్స్ తీసుకోవడంతో సంతృప్త హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఇలా చేయడంతో బరువు తగ్గే వీలుంటుంది. బరువు తగ్గాలనుకునే వారు చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతారు. ఇక వీటిని తీసుకోవడం వల్ల కూడా అదనపు క్యాలరీలు శరీరంలో చేరుతాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల బరువు తగ్గకపోగా బరువు మరింత పెరుగుతారు.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా సరే బాగా ఆకలి వేసే దాకా ఎదురు చూడాలి. మధ్యలో చిరుతిళ్ళు పొరపాటున కూడా తినకూడదు. అలా చిరుతిళ్లు ఎక్కువగా తినేవారు బరువు పెరుగుతారు. చిరుతిళ్ళకు బదులు సమయానికి అల్పాహారాన్ని, భోజనాన్ని ముగించాలి. సీజన్లో దొరికే పండ్లను తినొచ్చు.
ఇక ఆలస్యంగా నిద్రలేవడం, వ్యాయామం ఆలస్యంగా చేయడం, ఆ తర్వాత అల్పాహారం కూడా ఆలస్యంగా చేయడం, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం వంటి చర్యలు బరువును విపరీతంగా పెంచుతాయి. బరువు అదుపులో ఉండాలి అంటే ముఖ్యంగా పాటించవలసిన నియమం సరైన సమయానికి నిద్ర లేవడం, భోజనం చేయడం. ఎంత వ్యాయామం చేసినా, ఎన్ని ఆహార నియమాలు పాటించినా సమయం ప్రకారం చేయకపోతే ఫలితం ఉండదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
"దొండకాయ పకోడీ" అంటే ఆ హీరోయిన్‌కి అంత ఇష్టమా.. ఎలా చేయాలంటే ?? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications