ఎముకలు బలంగా అవడానికి 5 జ్యూస్ లు
మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైన పోషకాలు తీసుకోవాలి. ప్రధానంగా విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉన్న పానీయాలు తాగుతుండాలి. ఎముకలను బలోపేతం చేయడయతోపాటు వాటి సాంద్రతను మెరుగుపరచడంలో పాలు, పళ్లరసాలు ఎంతో సహాయపడతాయి. కాల్షియం మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విటమిన్ డి మన శరీరంలో కాల్షియంను గ్రహిస్తుంది. ఎముకల పెరుగుదలకు ఏవేం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు: కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం పాలు. పాలు అంటే ఆవు పాలు మాత్రమే కాదు, సోయా పాలు, కొబ్బరి పాలతో సహా అన్ని రకాల పాల నుండి మనం మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు.

గ్రీన్ స్మూతీలు: బచ్చలికూరతో సహా అనేక ఆకు కూరలతో చేసిన స్మూతీలు పోషకాలతో నిండి ఉంటాయి. కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
క్యాలీఫ్లవర్: క్యాలీఫ్లవర్ ను ఉడికించి తింటే కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె లభిస్తాయి. ప్రతిరోజు తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, దంతక్షయం వంటి సమస్యలు దూరమవుతాయి.
ఆరెంజ్ జ్యూస్: ప్రాసెస్ చేసిన ఆరెంజ్ జ్యూస్ కొని తాగే బదులు ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో అవసరమైన కాల్షియం, విటమిన్ సి ఉంటాయి. ఇవి మన ఎముకలను, కండరాలను బలోపేతం చేస్తుంది.
గ్రీన్ టీ: గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరం చురుగ్గా ఉంటుంది. అంతేకాదు.. కాల్షియం అవసరాన్ని తీరుస్తుంది. ఇది మన ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
వ్యాయామాలు: రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చేతులు, కాళ్లు, అన్ని కీళ్లను కదిలించే వ్యాయామాలు చేయడం ద్వారా ఎముకల మరింత దృఢంగా మారతాయి.












Click it and Unblock the Notifications