ఈ చిన్న చిట్కాలతో సహజంగా ఆరోగ్యకరంగా బరువు తగ్గండి
చాలామంది బరువు తగ్గాలని భావిస్తారు. బరువు తగ్గాలి అనుకునేవారు బరువు తగ్గడం కోసం రకరకాల డైట్స్ ఫాలో చేయడం, జిమ్స్ కు వెళ్లి ఎక్సర్సైజులు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే అది చేసినంతకాలం బరువు తగ్గినట్టే అనిపిస్తారు కానీ ఎప్పుడైతే మళ్లీ ఆపేస్తారో మళ్లీ బరువు పెరుగుతారు.
బరువు నిదానంగానే తగ్గాలి
సడన్ గా బరువు తగ్గడం ఏమాత్రం మంచిది కాదు. సడన్ గా బరువు తగ్గితే మనకు తెలియకుండానే సైడ్ ఎఫెక్ట్స్ గా అనేక రోగాలు వస్తాయి. కాబట్టి బరువును నిదానంగా తగ్గాలి. ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు కొన్ని టిప్స్ ను ఫాలో చేస్తే మంచిదని చెప్పొచ్చు.ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గడం చాలా ముఖ్యం.

బరువు తగ్గాలంటే ఇవి మస్ట్
బరువు తగ్గటం కోసం డైట్ ఒకటి సరిగ్గా ఉంటే సరిపోదు. సరైన ఫిజికల్ యాక్టివిటీ ని ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, వర్కౌట్స్ చేయడం జీవితంలో భాగం చేసుకోవాలి. బాగా బరువు తగ్గాలి అనుకునేవారు కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. వెయిట్ లాస్ ప్రక్రియలో నిద్రకు చాలా ప్రాధాన్యత ఉంది. నిద్ర ఎక్సెస్ ఫ్యాట్ ని శరీరం బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది.
బరువు తగ్గేందుకు ఇవి తినండి
ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు సుఖంగా నిద్రపోయిన వారు బరువు తగ్గుతారు. ఇక ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. మన శరీరంలో ప్రోటీన్ కావలసినంత ఉన్నప్పుడు మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సోయా, చికెన్, గుడ్లు, పన్నీర్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కండరాలు బలోపేతం అవుతాయి. మెటపాలిజం పెరుగుతుంది.
బరువు తగ్గాలంటే ఇలా చెయ్యండి
ఇక బరువు తగ్గాలంటే డిన్నర్ ను ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఇది వెయిట్ లాస్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. డిన్నర్ ఆలస్యం అవుతున్న కొద్దీ బరువు తగ్గే ఛాన్స్ తక్కువ అవుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం బరువు తగ్గాలని భావించేవారు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. మంచినీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది.
ఆరోగ్యంగా బరువు తగ్గించే కారకాలు ఇవే..
కనుక నిర్దిష్టమైన ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, శరీరానికి సరిపడా నీటిని తాగడం బరువును తగ్గించడంలో ప్రధాన కారకాలుగా పనిచేస్తాయి. ఇవి నిత్యం మన జీవితంలో భాగం చేసుకుంటే ఊబకాయం మనని వేధించదు కచ్చితంగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటాం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications