ప్రోటీన్ ఫుడ్స్ అధికంగా తింటున్నారా?

ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరమైన పోషకాంశం. ఇది కండరాలను నిర్మించడంలో, మరమ్మత్తులు చేయడంలో, మరియు శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని పరిమితికి మించి తీసుకుంటే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి.

ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కండరాల పెరుగుదల: శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళు, అథ్లెట్లు, బాడీ బిల్డర్స్ వంటి వాళ్ళకు ప్రోటీన్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వలన కండరాల పెరుగుదల త్వరగా జరుగుతుంది.

How Excessive Protein food Can Harm Your Health

స్థూలకాయం తగ్గుతుంది: ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. కడుపు తక్కువ సమయానికే నిండిపోయినట్లు అనిపిస్తే, అధిక కేలరీల ఆహారం తినడం తగ్గుతుంది. దీని వలన స్థూలకాయం తగ్గే అవకాశం ఉంది. కార్బోహైడ్రేట్స్ లేదా కొవ్వులు తక్కువగా తీసుకుంటున్నప్పుడు, శరీరం ప్రోటీన్‌ను కూడా శక్తి వనరుగా ఉపయోగించుకుంటుంది.

ఇమ్యూన్ సిస్టమ్: ప్రోటీన్ ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది, తద్వారా శరీరం రోగ నిరోధకతను పెంపొందించుకోవచ్చు. అయితే, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు:
కిడ్నీ సమస్యలు: ఒక వ్యక్తి ప్రోటీన్‌ను ఎక్కువగా తీసుకుంటే, కిడ్నీలు ప్రోటీన్ వ్యర్థాలను వడగట్టడంలో ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.దీర్ఘకాలంలో ఇది మూత్రపిండాలకు హాని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి, కిడ్నీ ఫంక్షన్‌ మీద ఒత్తిడి పెరిగి మరింత సమస్యలు రావచ్చు.

అసిడిటీ సమస్యలు:అధిక ప్రోటీన్ ఆహారం జీర్ణించుకోవడం కొంత కష్టం. కొన్ని సందర్భాల్లో శరీరంలో అసిడిటీ పెరిగి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.డీహైడ్రేషన్: అధిక ప్రోటీన్‌ను విరిచి వదిలించడానికి కిడ్నీలు ఎక్కువగా నీటిని వాడుతాయి. ఫలితంగా, నీరసం, డీహైడ్రేషన్ సమస్యలు ఎదురవుతాయి.

ఎముకల ఆరోగ్యంపై ప్రభావం: అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కాలిసియం నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఎముకలను బలహీనపరిచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులకు దారితీయవచ్చు.

ఆహారంలోని సమతుల్యత లోపం: ఎక్కువగా ప్రోటీన్ మీద ఆధారపడటం వలన, ఇతర ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, ఫైబర్ వంటి అంశాలు తక్కువగా తీసుకోబడి సమతుల ఆహారం లోపిస్తే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

కేన్సర్ ప్రమాదం: కొన్ని అధ్యయనాలు అధిక ప్రోటీన్ తీసుకోవడం కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంలో మరింత పరిశోధన అవసరం ఉంది..

ప్రోటీన్ అధికంగా గుడ్లు, చేపలు, చికెన్, పప్పు దినుసులు, పాల ఉత్పత్తులలో ఎక్కువగా లభిస్తుంది. అయితే ప్రోటీన్ మాత్రమే కాకుండా, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి ఇతర పోషకాలు కూడా సమతుల్య ఆహారంలో తీసుకోవాలి.

ప్రోటీన్ శరీరానికి అవసరమైనంతగా తీసుకోవడం మంచిదే. కానీ పరిమితికి మించి తీసుకోరాదు. ఒక సాధారణ వ్యక్తికి రోజుకు 1 కిలో బరువు పైన 0.8 నుండి 1.2 గ్రాముల ప్రోటీన్ అవసరం. అయితే, ఇది వ్యక్తి శారీరక శ్రమ, వయస్సు, లైఫ్‌స్టైల్ ఆధారంగా మారవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+