health tips: బీరు తాగడంవల్ల ఎన్ని ప్రయోజనాలో?
బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడంవల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఆందోళనను తగ్గిస్తుంది.
ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా నష్టాలు ఉంటాయని చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు మితంగా తీసుకునే ఆల్కాహాల్ కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంటుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం బీరు తాగడంవల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీరును మితంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో బీరు కూడా ఒకటి. వేసవి కాలంలో అయితే బీరు వినియోగం తారస్థాయికి చేరుకోవడమేకాదు.. అమ్మకాలు ఊహించని సంఖ్యలో ఉంటాయి. బీర్ ను మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలున్నాయి.
1) మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడంవల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది. అయితే బీరును ఎక్కువగా తీసుకోవడంవల్ల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కేవలం ఒక గ్లాసు బీరు తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలన్నీ అందుతాయి. బీరును ఎక్కువగా తాగితే హైబీపీ, ఊబకాయం, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

2) ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఎముకల ఆరోగ్యానికి బీర్ మంచిది. బీర్ అనేది డైటరీ సిలికాన్ మూలం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతోపాటు ఎముకలు పలచబడటాన్ని నిరోధిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
3) గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తక్కువ మొత్తంలో బీరు వినియోగం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ప్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉండటంతో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది.
4) డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితంగా తీసుకోవడంవల్ల మధుహేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయాల్లో తేలింది. డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మితమైన బీర్ వినియోగం మధ్య వయస్కులు, వృద్దుల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.
5) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీర్‌లో ఉండే కరిగే ఫైబర్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు దోహదపడతాయి. దీంతో పాటు బీర్ లో చేదుగా ఉండే ఆమ్లాలుటాయి. ఇవి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి ఆహారం జీర్ణం అవడాన్ని మెరుగుపరుస్తాయి.
-
టీలో చక్కెరకు బదులు ఇవి వాడి చూడండి: అస్సలు వదలరు -
దయచేసి నడవండి.. రోజుకు 7000 అడుగులేయండి.. -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications