Haleem రెస్టారెంట్ టేస్ట్‌తో ఇంట్లోనే సులభంగా
రంజాన్ నెల వచ్చిందంటే హలీమ్ వాసనలే గాలిలో తేలుతుంటాయి. మటన్, గోధుమలు, మసాలాల సమ్మేళనంతో గంటల పాటు మగ్గే ఈ వంటకం ఇప్పుడు ఇంటి వంటగదుల్లో కూడా ట్రెండ్‌గా మారింది. సరైన పదార్థాలతో సరిగ్గా ఉడికిస్తే ఇంట్లో తయారయ్యే హలీమ్ కూడా రెస్టారెంట్ రుచిని అందిస్తుంది. బయట హలీం తయారీపై చాలా మందికి అనుమానం ఉండటం సహజం. బయట ఎలాంటి మాసంతో తయారు చేస్తారనే భయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే తయారీ విధానం మీకోసం..
Haleem తయారీకి అవసరమైన పదార్థాలు
ధాన్యాలు & పప్పులు:
గోధుమ రవ్వ - 1 కప్పు
తూర్ దాల్, చనా దాల్, మసూర్ దాల్ - ఒక్కో 2 టేబుల్ స్పూన్లు
బియ్యం - 2 టేబుల్ స్పూన్లు
మాంసం:
మటన్ (ఎముకలతో) - 750 గ్రాములు నుంచి 1 కిలో
మసాలాలు:
అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరప పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా
బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క
ఫైనల్ గార్నిష్ కోసం:
వేయించిన ఉల్లిపాయలు (బిరిస్టా), నెయ్యి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ ముక్కలు

తయారీ విధానం
నానబెట్టిన గోధుమలు, పప్పులు, బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్‌లో మెత్తగా మగ్గించాలి. ఆ తర్వాత వాటిని బ్లెండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. మరోవైపు మటన్‌ను మసాలాలతో బాగా ఉడికించి, స్టాక్‌ను వేరు చేయకుండా ఉంచాలి.
పెద్ద గిన్నెలో ధాన్యాల పేస్ట్, మటన్, స్టాక్క.. అన్ని కలిపి సన్నని మంటపై కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు నిరంతరం కలుపుతూ మగ్గించాలి. మధ్య మధ్యలో నెయ్యి జతచేస్తే రుచి పెరుగుతుంది. చివర్లో గరం మసాలా, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి మరో 10 నిమిషాలు మగ్గించాలి.
రుచిని పెంచే చిట్కాలు
- స్లో కుకింగ్ విధానం పాటిస్తేనే సరైన టెక్స్చర్ వస్తుంది.
- ఎముకలతో ఉన్న మటన్ ఉపయోగిస్తే రుచి మరింత ఘనంగా ఉంటుంది.
- చెక్క స్పూన్‌తో కలుపుతూ ఉండడం వల్ల మిశ్రమం మృదువుగా మారుతుంది.
- చివర్లో నిమ్మరసం చల్లితే రుచికి ప్రత్యేక మజా అందుతుంది.
హలీమ్ అనేది కేవలం వంటకం కాదు.. సహనం, సమయం, సాంప్రదాయం కలయిక. సరైన విధానంలో తయారు చేస్తే ఇంట్లోనే హైదరాబాద్ శైలిలో హలీమ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ రంజాన్ మీ కుటుంబంతో కలిసి స్వయంగా తయారు చేసిన హలీమ్ రుచిని పంచుకోండి
-
రెస్టారెంట్ స్టైల్ "జీడిపప్పు చికెన్ పకోడీ" ఇలా చేస్తే అదరహో !! -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications