ఇంట్లోనే హైదరాబాదీ స్టైల్ "చికెన్ హలీమ్" ఈజీగా ఎలా చేయాలంటే..?

రంజాన్ మాసం ప్రారంభం కాగానే అంతా హలీం సువాసనలతో కళకళలాడుతుంది. ఇఫ్తార్ సమయానికి మసీదుల దగ్గర నుంచి ప్రముఖ హోటళ్ల వరకు ఎక్కడ చూసినా హలీం కోసం పెద్ద క్యూలు కనిపిస్తాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా హలీం లభించినప్పటికీ.. హైదరాబాద్ హలీం మాత్రం ప్రత్యేకమైన రుచి, ఘాటు మసాలా, నెయ్యి సువాసనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలకు హలీం అంటే మొదట గుర్తుకు వచ్చేది హైదరాబాద్ నగరమే.

హలీం..

కాగా హలీం అనేది మాంసం, ధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులు కలిపి నెమ్మదిగా గంటల తరబడి ఉడికించే ప్రత్యేక వంటకం. సాధారణంగా మటన్‌తో చేసే వంటకాన్నే అసలు హలీంగా పరిగణిస్తారు. అయితే చికెన్‌తో తయారు చేసే వంటకాన్ని 'హరీస్' అని పిలుస్తారు. అయినప్పటికీ ప్రస్తుతం చాలా చోట్ల దీనిని 'చికెన్ హలీం' అనే పేరుతోనే పిలుస్తున్నారు. ఈ వంటకం రుచిగా రావాలంటే చాలా ఓర్పుతో, నెమ్మదిగా తయారు చేయాల్సి ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

hyderabadi-style-chicken-haleem-making-recipe-in-telugu-with-easy-steps-at-home-and-also-serving-t

కావాల్సిన పదార్దాలు..

  • అర కిలో ఎముకలు లేని చికెన్
  • నాలుగు పెద్ద చెంచాలు నెయ్యి
  • పావు కప్పు బాదం
  • అర కప్పు జీడిపప్పు
  • 10-15 పిస్తాలు
  • రెండు అంగుళాల దాల్చిన చెక్క
  • ఒక బిర్యానీ ఆకు
  • నాలుగు యాలకులు
  • ఐదు లవంగాలు
  • ఒక చిన్న చెంచా మిరియాలు
  • ఒక చిన్న చెంచా కలపాసి
  • ఒక చిన్న చెంచా షాహీ జీరా
  • ఒక చిన్న చెంచా కబాబ్ చినీ
  • ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు
  • ఆరు పచ్చిమిర్చి
  • రెండు చిన్న చెంచాలు అల్లం వెల్లుల్లి ముద్ద
  • చిటికెడు పసుపు
  • ఒక చిన్న చెంచా ధనియాల పొడి
  • ఒకటిన్నర చిన్న చెంచా కారం పొడి
  • అర చిన్న చెంచా వేపిన జీలకర్ర పొడి
  • అర చిన్న చెంచా మిరియాల పొడి
  • అర కప్పు పెరుగు
  • కొద్దిగా కొత్తిమీర
  • కొద్దిగా పుదీనా
  • సుమారు 750 మిల్లీ లీటర్ల నీరు
  • మూడో వంతు కప్పు గోధుమ రవ్వ
  • ఒక పెద్ద చెంచా సెనగపప్పు
  • ఒక పెద్ద చెంచా బియ్యం
  • ఒక పెద్ద చెంచా మినప్పప్పు
  • ఒకటిన్నర పెద్ద చెంచాలు ఓట్స్ లేదా బార్లీ
  • ఒక చిన్న చెంచా కందిపప్పు
  • ఒక చిన్న చెంచా పెసరపప్పు
  • ఒక చిన్న చెంచా నువ్వులు
  • పావు కప్పు పాలు
  • రెండు పెద్ద చెంచాలు ఎండిన గులాబీ రేకులు
  • ఒకటిన్నర పెద్ద చెంచాలు గరం మసాలా
  • ఒక కప్పు వేపిన ఉల్లిపాయలు
  • అలంకరణ కోసం వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తాలు
  • సర్వింగ్ కోసం నిమ్మరసం
  • కావాలనుకుంటే ఉడికించిన గుడ్డు (అలంకరణకు)

తయారీ విధానం..

ముందుగా అన్ని పప్పులు, ధాన్యాలను కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, పిస్తాలను బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టాలి.

మసాలా తయారీ..

అదే నెయ్యిలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వంటి మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి మారేవరకు వేపాలి. ఇది హలీంకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.

చికెన్ ఉడికించడం..

తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు ఎక్కువ మంటపై వేయించాలి.

మిగిలిన మసాలా పొడులు, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి బాగా కలపాలి.

అనంతరం తగినంత నీరు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

హలీం మిశ్రమం తయారీ..

చికెన్ ఉడికిన తర్వాత గరిటతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి.

మరో గిన్నెలో నెయ్యి వేసి రుబ్బిన పప్పుల ముద్దను నీటితో కలిపి ఉడికించాలి. ముద్దలు కట్టకుండా కనీసం పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి.

చివరి దశ..

పప్పుల ముద్ద చిక్కబడిన తర్వాత చికెన్ ముద్దను అందులో కలిపి బాగా చిలకాలి.

తర్వాత డ్రై ఫ్రూట్స్ పేస్ట్, గరం మసాలా, నెయ్యి వేసి కొద్దిసేపు నెమ్మదిగా ఉడికించాలి.

చివరగా వేపిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి మరికొంత సేపు సన్నని మంటపై ఉంచాలి.

సర్వింగ్ విధానం..

చివరగా ఎండిన గులాబీ రేకులు లేదా గులాబీ నీరు, పాలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. వేడిగా ఉన్న హలీంను ఒక గిన్నెలో తీసుకుని పైన నెయ్యి, వేపిన జీడిపప్పు, వేపిన ఉల్లిపాయలు, నిమ్మరసం, ఉడికించిన గుడ్డు వేసి అలంకరించి అందిస్తే ఇంట్లోనే హైదరాబాద్ అసలు రుచిని ఆస్వాదించినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+