సొరకాయ తింటే బోలెడు అనారోగ్యాలకు చెక్.. అవేమిటో తెలుసా!
మనకు ఆరోగ్యాన్ని అందించే కూరగాయలలో సొరకాయ ఒకటి. సొరకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక అనారోగ్యాలు దూరమవుతాయి. సొరకాయలో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్, ప్రోటీన్లు, తక్కువ క్యాలరీలు ఉంటాయి. సొరకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సొరకాయలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది.
సొరకాయ తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్
సొరకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే మనకు జీర్ణ సంబంధమైన సమస్యలు రావు. తరచుగా సొరకాయలను తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. సొరకాయని తినడం వల్ల హై బీపీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు సొరకాయ తింటే బరువు తగ్గడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది.

డయాబెటిస్ కంట్రోల్, వాటికి చెక్
సొరకాయలు తిన్నవారిలో మధుమేహం అదుపులో ఉంటుంది. సొరకాయలలో ఉండే క్యాలరీలు, పీచుపదార్థాలు తక్కువగా ఉండడం కారణంగా ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. సొరకాయలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు మన ఎముకలను బలోపేతం చేస్తాయి. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయి.
సొరకాయ తింటే ఒత్తిడి పరార్
ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సొరకాయను ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకుంటే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. విపరీతమైన స్ట్రెస్ కారణంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్న కారణంగా ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సొరకాయ మంచి ఆహారం సొరకాయని జ్యూస్ చేసుకుని తాగిన కూర చేసుకుని తిన్న ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
చర్మానికి సొరకాయలతో ఆరోగ్యం
మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు సొరకాయలను తినడం ఎంతో మేలు చేస్తుంది. ఇది మూత్ర సంబంధిత సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎన్నో పోషక విలువలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే సొరకాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. సొరకాయలో ఉండే సహజ నీరు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మపు రంగును మెరుగు పరచడంతో పాటు, శరీరంలో ఊహించని మార్పులు తీసుకువస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications