రాత్రిపూట ఈ ఆహారాలు తింటే ఈజీగా బరువు తగ్గుతారు.. ట్రై చెయ్యండి!

చాలామంది బరువు తగ్గడం కోసం డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునేవారు రాత్రివేళ ఏడు గంటల లోపే ఆహారం తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇక రాత్రిపూట తీసుకునే ఆహారంలో కూడా కొన్ని రకాల ఆహారాలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. మరి అవి ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే రాత్రి ఇవి తినండి
బరువు తగ్గాలని భావించేవారు రాత్రిపూట చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినట్టు రాత్రి కూడా అల్పాహారం తీసుకోవడం మంచి పద్ధతి కాదు. రాత్రులు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా రాత్రిపూట కొన్ని రకాల ఆరపదార్థాలను తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతాము. బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట వెజిటబుల్ సలాడ్ తీసుకోవడం ఒక మంచి ఆహారపు అలవాటు. వెజిటబుల్స్ సలాడ్ తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతాము.

If you eat these foods at night you will lose weight easily Try it

కిచిడీ తినండి... కానీ
ఇక బరువు తగ్గాలని భావించేవారు కిచిడీ తీసుకుంటే మంచిది. కిచిడీ కూడా ఓ చక్కని రెసిపీ. ఇందులో పెసరపప్పు నెయ్యి కూరగాయలు ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేసి మంచి పోషకాలతో తయారు చేస్తారు. ఇక కిచిడీని బరువు తగ్గాలనుకునే వారు రాత్రి 7 గంటల లోపే తినాలి. అప్పుడే దీని ఫలితం ఉంటుంది.

దాలియా, ఓట్స్ తో బరువుకు చెక్
బరువు తగ్గాలని భావించేవారు గోధుమ రవ్వ పెసరపప్పుతో చేసిన దాలియా కూడా తింటే మంచిది. ఇందులో కూడా రకరకాల కూరగాయలను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో బాగా దోహదం చేస్తుంది. రాత్రివేళ తీసుకునే ఆహారంలో బరువు తగ్గడానికి దోహదం చేసే వాటిలో ఓట్స్ ఒకటి. ఓట్స్ బరువు తగ్గడానికి బాగా దోహదం చేస్తుంది. ఇది త్వరగా జీర్ణం అవడంతో పాటు మనకు లైట్ ఫీలింగ్ ఇస్తుంది.

బరువు తగ్గాలంటే సూప్స్ బెస్ట్
ఇక బరువు తగ్గాలనుకునేవారు సూప్స్ ను తీసుకోవడం కూడా మంచిది. సూప్ తాగడం వల్ల కూడా బరువు తగ్గుతారు. సూప్స్ చాలా త్వరగా జీర్ణం అవుతాయి. కొంతమంది సూప్స్ తో కడుపు నిండిన ఫీలింగ్ రాకపోతే వాటిల్లో క్యారెట్, గ్రీన్ పీస్, కార్న్ వంటివి యాడ్ చేసుకుని తీసుకుంటే మంచిది. ముఖ్యంగా అన్నిటికంటే బరువు తగ్గాలని భావించేవారు రాత్రి 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేసేయాలి ఇది మీకు అన్ని విధాలుగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+