మీకు ఈ లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నట్టే!

ప్రస్తుతం ప్రపంచంలో అధిక శాతం ప్రజలు డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ టు డయాబెటిస్ తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, విపరీతంగా పెరిగిన ఒత్తిడి కారణంగా ప్రజలు డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు.

డయాబెటిస్ లక్షణాలు
అయితే డయాబెటిస్ వచ్చిన వారికి డయాబెటిస్ కి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ప్రారంభ దశలో కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి. ఇంట్లో ఫ్యాన్ లేదా ఏసీ ఉన్నప్పటికీ చెమటలు పడితే డయాబెటిస్ గా అనుమానించాలి.

If you have these symptoms you may have diabetes

చెమటలు పట్టటం, అధిక మూత్ర విసర్జన
బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పడిపోతే చెమటలు పడతాయి. ఇక ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటే డయాబెటిస్ అని గుర్తించాలి. అంతేకాదు రాత్రి వేళల్లో తరచూ మూత్ర విసర్జనకు లేచినా ఇది డయాబెటిస్ లక్షణంగా గుర్తించాలి. తరచూ మూత్ర విసర్జన డయాబెటిస్ కు ఒక సంకేతం అని చెప్పొచ్చు.

అలసట, అర్దరాత్రి అసౌకర్యం
ఇక అర్ధరాత్రి హార్ట్ బీట్ పెరిగినా, మధ్య రాత్రి అసౌకర్యంగా అనిపించినా ఇది కూడా డయాబెటిస్ కు ఒక లక్షణంగా చెప్పవచ్చు. శారీరకంగా శ్రమ పడకపోయినా తీవ్రంగా అలసిపోయినట్టు అనిపిస్తే ఇది కూడా డయాబెటిస్ కు ఒక సంకేతంగా చెబుతున్నారు ఇక మితిమీరిన దాహం కూడా డయాబెటిస్ బాధితులకు కనిపించే ఒక లక్షణంగా వైద్యులు చెబుతున్నారు ఇక అధిక బరువు ఉన్న వారిలోనూ డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

బరువు తగ్గటం, కళ్ళు మసకబారటం.. ఇలా లక్షణాలు
అనుకోకుండా బరువు తగ్గడం, కళ్ళు మసకబారడం, నోటి ఇన్ఫెక్షన్లు, మహిళల్లో యోని ఇన్ఫెక్షన్లు, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా డయాబెటిస్ లక్షణాలుగా చెప్పవచ్చు ఎవరికైనా ఇటువంటి సమస్యలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించి డయాబెటిస్ పరీక్షలు చేయించుకొని వ్యాధిని నిర్ధారించుకోవాలి నిర్లక్ష్యం ఏమాత్రం మంచిది కాదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+