ఈ లక్షణాలు ఉంటే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే ... జాగ్రత్త!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యకరమైన జీవనశైలి, ఊబకాయం మనలో ఫ్యాటీ లివర్ సమస్యను పెంచుతుంది. కాలేయంపై కొవ్వు అధికంగా పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఎలా వస్తుంది దీని లక్షణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.

ఈ కారణాలతో ఫ్యాటీలివర్ సమస్య
సరైన జీవన శైలి లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో, అధిక బరువు, అధిక ఆల్కహాల్ తీసుకోవడం, డయాబెటిస్ మెల్లిటస్,
ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో అధిక స్థాయి కొవ్వులు, మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా ఫ్యాటీలివర్ సమస్య వస్తుంది. ఇక ఫ్యాటీ లివర్ సమస్య వచ్చిన వారికి కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి.

If you have these symptoms you probably have fatty liver be careful

ఈ లక్షణాలతో ఫ్యాటీ లివర్ సమస్య
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారి కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. రక్తంలో బిలురూబిన్ పెరిగి చర్మం మరియు కళ్ళు పసుపు రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది.
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. చర్మంపై దురద సమస్య కనిపిస్తుంది. విపరీతంగా బరువు పెరుగుతారు. ఫ్యాటీ లివర్ వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.

అధిక బరువుతో పాటు ఈ లక్షణాలు
దీనివల్ల బరువు పెరిగే సమస్య ఎక్కువవుతుంది. దీని కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి నిద్రలేమి ఒక సహజ లక్షణంగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి సరిగా నిద్ర పోలేక వారు ఇబ్బంది పడతారు. రోజంతా అలసటగాను, బద్ధకంగానూ ఉంటారు.

ప్రారంభ దశలో జీవనశైలిలో కొన్ని మార్పులతో ఫ్యాటీ లివర్ కు చెక్
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి పీరియడ్స్ క్రమ రహితంగా ఉంటాయి. నెలసరి సరిగ్గా రాక మహిళలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వారు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లుగా గుర్తించాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఉన్నట్లయితే, వారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధిని నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+