ఇవి తినండి... కడుపులోని చెత్తంతా బయటకు వచ్చేస్తుంది
జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుండాలి. కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు అనిపించడం, కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన భావన కలగడంతోపాటు గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం.. పేగుల్లో, కడుపులో పేరుకుపోయిన చెత్త. ప్రతి ఒక్కరూ ఈ రెండింటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. శరీరంలోని జీవక్రియ సరిగా పనిచేయకపోయినా, నెమ్మదిగా పనిచేస్తున్నా చెత్త, వ్యర్థాలు, టాక్సిన్స్ ను శరీరం నుంచి ఎలా బయటకు పంపించాలో తెలుసుకుందాం.
ప్రోబయోటిక్స్ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. కడుపులోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇది కడుపులో, పేగులలోని చెత్తను శుభ్రం చేస్తుంది. పెరుగు, పులియబెట్టిన పదార్థాలు, మజ్జిగ, ఛీజ్.. వంటివి ప్రతిరోజు తీసుకుంటుండాలి. వ్యర్థాలను బయటకు పంపించడానికి తోడు పేగులను సంరక్షించుకోవడానికి ప్రతిరోజు 2 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తాగుతుండాలి. నీళ్లు చెత్తను, టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. తీసుకునే ఆహారంలో డైటరీ ఫైబర్ మొత్తాన్ని పెంచుకోవాలి. జీర్ణకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఫైబర్ తోడ్పడుతుంది. పండ్లు కాయగూరలు, పప్పులు, నట్స్, గింజలు తీసుకుంటుండాలి.

పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉండి కడుపు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. కడుపు, పేగుల్లో ముండే మురికిని పండ్లు బయటకు పంపిస్తాయి. వీటిల్లో ఫైబర్ ఎక్కువ. జ్యూస్ కు బదులుగా పండ్లను తినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అలవాటు చేసుకుంటే మీ కడుపు మీరు శుభ్రం చేసుకున్నట్లే. కొందరు ఒకేసారి ఎక్కువ మొత్తం తీసుకుంటుంటారు. అలా కాకుండా రోజు మొత్తం మీద విడతల వారీగా కొంచెం కొంచెం తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల జీర్ణకోశం పనితీరు మెరుగుపడుతుంది.
-
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం












Click it and Unblock the Notifications