బ్లడ్ క్యాన్సర్ ప్రాణాంతకమా?.. ప్రారంభ సంకేతాలు , లక్షణాలు ఇవే!

బ్లడ్ క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఇది రక్తం , ఎముక మజ్జలో ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేస్తుంది. బడ్ల్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఎముక మజ్జ అసారధారమైన తెల్ల రక్త కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కణాలు సాధారణ రక్తకణాల పనితీరును అడ్డుకుంటాయి. దీని వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందిస్తే .. ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది.

రక్త క్యాన్సర్ వచ్చినప్పుడు, ఎముక మజ్జ అసాధారణమైన తెల్ల రక్త కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ కణాలు సాధారణ రక్త కణాల పనితీరును అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందిస్తే, వ్యాధిని నయం చేసే అవకాశం ఉంది.

is-blood-cancer-fatal-these-are-the-early-signs-and-symptoms

బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు:
బ్లడ్ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. వీటిని ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే అవకాశం ఉంది. అందుకే, ఈ లక్షణాలను తేలికగా తీసుకోకూడదు. కారణం లేకుండా విపరీతమైన అలసట, నీరసం కలగడం బ్లడ్ క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం. ఇది సాధారణ అలసటలా కాకుండా, రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా శక్తి సరిపోనంతగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల తరచుగా జ్వరం రావడం, ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. మామూలు ఇన్ఫెక్షన్లు కూడా తీవ్రంగా మారవచ్చు.

ఎముకలు, కీళ్లలో నొప్పి..
చిన్న గాయాలకే ఎక్కువ రక్తస్రావం అవ్వడం, చర్మంపై కారణం లేకుండా నీలి రంగు మచ్చలు ఏర్పడటం వంటివి రక్త క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. ఎముకలు, కీళ్లలో నొప్పి, ముఖ్యంగా రాత్రి వేళల్లో నొప్పి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. లింఫ్ నోడ్స్ వాపు రావడం, గడ్డల్లా కనిపించడం. ఇవి నొప్పి లేకుండా కూడా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లు మారకుండానే బరువు తగ్గడం. రాత్రి వేళల్లో విపరీతంగా చెమటలు పట్టడం, దుస్తులు తడిసిపోయేలా ఉండటం. కారణం లేకుండా చర్మంపై దురద, దద్దుర్లు రావడం. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. ఇవి బ్లడ్ క్యాన్సర్ కాకుండా ఇతర సమస్యల వల్ల కూడా రావచ్చు. కానీ, నిర్ధారణ చేసుకోవడం ఉత్తమం.

బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు:
వైద్యులు బ్లడ్ క్యాన్సర్ అనుమానించినప్పుడు, కొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలు వ్యాధిని ఖచ్చితంగా గుర్తించడానికి సహాయపడతాయి. వాటిల్లో కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC). ఇది రక్త కణాల సంఖ్యను, రకాలను తెలుసుకోవడానికి చేసే ప్రాథమిక పరీక్ష. అసాధారణ కణాలు ఉంటే ఈ పరీక్షలో తెలుస్తుంది. పెరిఫెరల్ బ్లడ్ స్మియర్ ఇది రక్త కణాలను మైక్రోస్కోప్‌లో పరీక్షించడం. కణాల ఆకారం, పరిమాణం, అసాధారణతలు తెలుస్తాయి.

బోన్ మ్యారో ఆస్పిరేషన్ , బయాప్సీ:
ఇది ఎముక మజ్జ నుండి నమూనాను తీసి పరీక్షించడం. ఇది బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణకు చాలా ముఖ్యమైన పరీక్ష. క్యాన్సర్ కణాలు, వాటి రకం తెలుస్తుంది. CT స్కాన్, MRI, PET స్కాన్ వంటి పరీక్షలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాధి వ్యాప్తి చెందిందా అని తెలుసుకోవడానికి చేస్తారు. లింఫ్ నోడ్ బయాప్సీ. దీనిని లింఫ్ నోడ్స్ వాపు ఉంటే, బయాప్సీ చేసి క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. వ్యాధి రకాన్ని, దశను బట్టి చికిత్స ప్రణాళికను వైద్యులు నిర్ణయిస్తారు.

బ్లడ్ క్యాన్సర్ చికిత్స:
బ్లడ్ క్యాన్సర్ చికిత్స వ్యాధి రకం, దశ, రోగి వయస్సు, ఆరోగ్యం వంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చికిత్సల్లో కీమోథెరపీ ఒకటి. ఇది క్యాన్సర్ కణాలను చంపడానికి మందులు వాడతారు. ఇది మాత్రలు లేదా ఇంజెక్షన్ల రూపంలో ఉంటుంది. అధిక శక్తి గల కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇది ఆరోగ్యకరమైన స్టెమ్ సెల్స్‌ను రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనిని కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ తర్వాత చేస్తారు.

టార్గెటెడ్ థెరపీ క్యాన్సర్ కణాల్లోని నిర్దిష్ట లక్ష్యాలను గుర్తించి, వాటిని నాశనం చేసే మందులు వాడతారు. ఇమ్యునోథెరపీశరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, క్యాన్సర్ కణాలతో పోరాడేలా చేస్తారు. చికిత్స తర్వాత, రోగి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి తిరిగి రాకుండా నిరోధించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వైద్యులు సూచనలు పాటిస్తూ ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+