HMPV Virus ప్రమాదకరమా? లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?
ప్రస్తుతం చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇక చైనాలో కలకలం సృష్టిస్తున్న హెచ్ఎంపీవి వైరస్ ప్రస్తుతం భారతదేశంలోకి కూడా ఎంటర్ అయింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ గా నిర్ధారణ అయింది. హ్యూమన్ మెటా న్యుమో వైరస్ గా చెప్పే హెచ్ఎంపీవి వైరస్ చైనాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ కావడంతో దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు.. ఎవరికి ప్రమాదమంటే
అయితే ఇది ఏ వయసు వారికే ఎక్కువగా వస్తుంది? ఈ హెచ్ఎంపీవి వైరస్ ప్రమాదకరమా కాదా? అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ మెదులుతున్న ప్రశ్న.హెచ్ఎంపీవీ వైరస్ ఐదేళ్లలోపు చిన్నారులకు, రోగ నిరోధక శక్తి సరిగ్గా లేని వారికి, ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ వైరస్ లక్షణాలను చూసినట్లయితే దగ్గు, జ్వరం, ముక్కు కారడం, ముక్కు దిబ్బడగా ఉండడం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలే కనిపిస్తాయి.

హెచ్ఎంపీవీ వైరస్ తో బ్రాంకైటిస్ ముప్పు
ఇక కొంతమందిలో శ్వాస ఆడటం ఇబ్బందికరంగా మారుతుంది. చాలామందిలో ఈ లక్షణాలు కనిపించిన రెండు రోజుల నుంచి ఐదు రోజుల్లోపు తగ్గిపోతాయి. కొందరికి మాత్రం ఈ లక్షణాలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నప్పుడు దగ్గు ద్వారా, తుమ్మడం ద్వారా, శ్వాస బిందువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.కొన్నిసార్లు ఇది బ్రాంకైటిస్ కి కూడా దారితీస్తుంది. న్యుమోనియా గా కూడా ఇబ్బంది పెడుతుంది.
నో వ్యాక్సిన్, నో మెడిసిన్
అయితే శ్వాసకోసానికి సంబంధించి అంతర్లీన వైద్య పరిస్థితులతో బాధపడే వారికి ఈ వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తీవ్రమైన శ్వాసకోశ సమస్య వస్తే అది మరణానికి కూడా దారి తీయవచ్చునని, ఇప్పటికే చైనా యొక్క సిడిసి వెల్లడించింది. అయితే హెచ్ ఎం పి వి కి ప్రస్తుతం వ్యతిరేకంగా ఎటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో లేవని, సమర్థవంతమైన మందులు కూడా లేవని పేర్కొంది.
లక్షణాలను తగ్గించటానికే మెడిసిన్స్
దీనికి చికిత్స చేయడానికి ఎక్కువగా లక్షణాలను తగ్గించడం పైనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని పలువురు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో దీనిపైన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా ఇండియాలో కూడా తాజాగా కేసులు నమోదు కావటంతో జాగ్రత్తలు పాటించటం, వ్యాప్తి జరగకుండా ఎవరిని వారు కాపాడుకోవడం అవసరం అని చెప్తున్నారు.
-
యువతలో కొత్తరకం లైంగిక అలవాట్లు.. గొంతు క్యాన్సర్ ముప్పు తప్పదా..? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications