జ్ఞాపకశక్తి మందగిస్తుందా.. అయితే మెదడును షార్ప్‌గా ఉంచే ట్రిక్స్ ఇవిగో!
మన రోజువారీ జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, శారీరక శ్రమలతో మానసిక సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు మతిమరపు సమస్యలు, సాధారణంగా గందరగోళం, ఏదైనా గుర్తు పట్టలేకపోవడం, ఏదైనా పని మరిచిపోవడం అనేవి సాధారణమే. కానీ దీర్ఘకాలికంగా జ్ఞాపకశక్తి మందగిస్తే, అది ఆందోళనకరమైన విషయం కావచ్చు. అయితే, సరైన ఆహారం, వ్యాయామం, మానసిక శ్రమ, జీవనశైలి మార్పులు ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
మెదడుకు సరైన ఆహారం అందించాలి
శరీరానికి, ముఖ్యంగా మెదడుకు అవసరమైన పోషకాలు అందకపోతే జ్ఞాపకశక్తి మందగించవచ్చు. అందుకే, పోషకాహారం తీసుకోవడం అనేది అత్యంత కీలకం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్స్ తినడం మెదడుకు మేలు చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బెర్రీ పండ్లు, గ్రీన్ టీ, క్యారెట్, బీట్‌రూట్ లాంటి ఆహారాలు మెదడును ఉత్తేజితం చేస్తాయి. పెరుగును తినడం వల్ల దానిలోని ప్రొబయాటిక్స్ ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్ కూడా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇది మెదడుకు కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు అందిస్తుంది. అంతే కాకుండా సపోటా, యాపిల్, అవకాడో, స్పినచ్ వంటి ఆహార పదార్థాలు మెదడును శక్తివంతంగా ఉంచుతాయి.
వ్యాయామం & ధ్యానం చేయడం
శారీరక శ్రమ లేకపోతే మెదడు నెమ్మదించిపోతుంది. కాబట్టి వ్యాయామాన్ని నిత్యక్రియగా చేసుకోవాలి. నడక, జాగింగ్, యోగా వల్ల రక్త ప్రసరణను మెరుగుపరిచి మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి.
ధ్యానం & ప్రాణాయామం చేస్తే ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. శరీర ధృఢత్వాన్ని పెంచే వ్యాయామాలైన స్ట్రెచింగ్, స్విమ్మింగ్, డాన్స్ వంటి శారీరక శ్రమలు మెదడు కణాలను ఉత్తేజితం చేస్తాయి.
మెదడును శక్తివంతంగా ఉంచే అలవాట్లు
క్రాస్‌వర్డ్స్, పజిల్స్, సుదోకు వంటి అలవాట్లు పెంచుకోండి. ఇది మెదడు చురుకుగా ఉండటానికి సహాయపడతాయి. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుతుంది . కొత్త భాష లేదా నైపుణ్యాన్ని అభ్యాసం చేయడం వల్ల మెదడు వినాశనాన్ని నివారించడంలో సహాయపడుతుంది. చిత్రలేఖనం, సంగీతం, క్రియేటివ్ ఆర్ట్స్ మీ మెదడు ఉత్తేజితంగా ఉండేందుకు సహాయపడతాయి. ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం ద్వారా మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. అధిక బరువు మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. పాజిటివ్‌గా ఉండడం అలవాటు చేసుకోండి. ఇది సంతోషంగా ఉండే వ్యక్తుల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ఇంటి చిట్కాలు
బాదం & గుడ్డు తీసుకోండి. రోజూ 5-6 బాదం తినడం మెదడు చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది. అదే విధంగా మెంతులు & జీలకర్ర నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఇవి మెదడుకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. తులసి, అశ్వగంధ, బ్రాహ్మి వంటివి తీసుకోండి. ఇవి మెదడు శక్తిని పెంచే సహజమైన ఆయుర్వేద మూలికలుగా పనిచేస్తాయి.
జ్ఞాపకశక్తి మందగించకుండా ఉండాలంటే, సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మెదడుకు మానసిక శ్రమ ఇవన్నీ సమతుల్యంగా ఉండాలి. మన మెదడును ఉపయోగంలో ఉంచే ప్రయత్నం చేయాలి. జీవితంలో చిన్న మార్పులతో మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా మెదడు చురుకుగా ఉండేలా చూసుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు సందేహాలు ఉంటే, దయచేసి వైద్య నిపుణులను సంప్రదించండి.
-
జీరా వాటర్ Vs మెంతుల నీరు- షుగర్ కంట్రోల్ చేయడానికి ఏది బెస్ట్..!! -
గుంటూరు స్పెషల్ "కోవా మాల్ పూరీ" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications