ఐటీ ఉద్యోగుల్లో 'బర్నవుట్ సిండ్రోమ్'.. బయట పడేందుకు మార్గాలు ఇవే..!
సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో చాలా మందికి ఇప్పుడు 'బర్నవుట్ సిండ్రోమ్' సమస్య ప్రధానంగా మారింది. పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత కారణాలతో మానసిక ఒత్తిడి లోనవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. పని- వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత లేకపోవడం కారణంగా ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోయి అది బర్నవుట్ సిండ్రోమ్ కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 7 గురు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేల్చారు.
ఈ బర్నవుట్ సిండ్రోమ్ కు గురైన ఉద్యోగులు మానసిక, శారీరక అలసటతోపాటు అధిక పని ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో వారి భావోద్వేగాలు అదుపులో ఉండటం లేదు. దీన్నే బర్నవుట్ సిండ్రోమ్ అంటారని వైద్యులు చెబుతున్నారు. ఇక బర్నవుట్ సిండ్రోమ్ లక్షణాలు చూస్తే.. శారీరకంగా బలహీనంగా ఉండటం, చేసే పనిపట్ల ఆసక్తి తగ్గిపోవడం, ఎప్పుడూ ఆందోళనతో ఉండటం, చిన్న విషయాలకే చిరాకు పడటం, సమయానికి నిద్ర రాకపోవడం, ఫ్యామిలీ రిలేషన్స్ కు దూరంగా ఉండటం, నిరుత్సాహంతో ఉండటం లాంటివి అని వైద్యులు చెబుతున్నారు.

మరి ఈ బర్నవుట్ సిండ్రోమ్ ను తగ్గించుకునేందుకు వైద్యులు కొన్ని పరిష్కారాలు చెబుతున్నారు.యోగా, ధ్యానం అలవర్చుకోవడం, రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం,ఉదయాన్నే సూర్యోదయం చూడాలి. ఏకధాటిగా పని చేయకుండా చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని నడవాలి. మొబైల్ ఫోన్ లో కాలక్షేపం చేయకుండా కుటుంబంతో సమయం గడపాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications