నేరేడు పండ్లు తింటే ఆరోగ్యం అద్భుతంగా ఉండు!
నేరేడు పండ్లు.. వర్షాకాలంలోనే దొరికే సీజనల్ పండ్లు. ఇక నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్య ఔషధమని చాలామంది ఆయుర్వేద నిపుణులు చెబుతారు. ఎన్నో రోగాలకు సహజ నివారణగా పనిచేసే నేరేడు పండ్లలో బోలెడన్ని పోషకాలు సమృద్ధిగా ఉన్నాయని చెబుతారు. నేరేడు పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయని చెబుతారు.
నేరేడుపండ్లతో డయాబెటిస్ కంట్రోల్
నేరేడు పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి అవి ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం. నేరేడు పండ్లను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. నేరేడు పండ్లలో ఉండే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ రక్తంలో గ్లూకోజ్ లెవెల్ ను నియంత్రించడానికి దోహదం చేస్తుంది. దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

నేరేడు పండ్లతో కంటి ఆరోగ్యం, నరాల ఆరోగ్యం
నేరేడు పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కళ్ళల్లో రక్తప్రసరణను మెరుగుపరచడానికి, కంటి వాపును తగ్గించడానికి దోహదం చేస్తుంది. నేరేడు పండ్లలో ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఇవి నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యం, బరువుకు చెక్
నేరేడు పండ్లలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. హైపర్ టెన్షన్, ఊబకాయం వంటి సమస్యల నుంచి నేరేడు పండ్లు మనల్ని కాపాడతాయి. బరువు తగ్గడానికి నేరేడు పండ్లు దోహదం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నేరేడుపండ్లు ఉపయోగపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి నేరేడు పండ్లు దోహదం చేస్తాయి.
చర్మ ఆరోగ్యం, జుట్టు బలోపేతం, యవ్వనంగా
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, రక్తహీనతను తగ్గించడానికి నేరేడు పండ్లు ఉపయోగపడతాయి. ఎముకలు దృఢంగా ఉండడానికి, మన చర్మ ఆరోగ్యానికి, జుట్టు సంరక్షణకు నేరేడు పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. చర్మంపైన ముడతలను తగ్గించి త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే నేరేడు పండ్లను తప్పనిసరిగా ప్రతి సీజన్లోనూ తింటే మంచిది. ఇవి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీటిని సీజన్లో తింటే బరువు తగ్గడానికి కూడా ఎంతగానో దోహదం చేస్తాయి.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఆ స్టార్ హీరో ఫేవరెట్ "బంగాళ దుంప - దోసకాయ" కర్రీ ఎలా చేయాలంటే..? -
ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలా? ఇవి ఆహారంలో తీసుకోండి! -
eye health food: కంటి చూపును కాపాడే ఆహారాలు.. ఇప్పుడు ఇవి చాలా అవసరం! -
ఈ ఫోటోలో "పిజ్జా" పీస్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? -
కల్తీ మామిడి పండ్లపై హెచ్-ఫాస్ట్ నిఘా.. సమాచారం ఇవ్వమన్న సీపీ సజ్జనార్ -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications