బరువు తగ్గటానికి ఈ జ్యూస్ తాగండి చాలు!

బరువు తగ్గాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు ఆహార నియమాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు ఒక జ్యూస్ తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు డైటీషియన్లు.

బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ బెస్ట్
బరువు తగ్గాలనుకునే వారు కీరదోస అల్లంతో చేసే జ్యూస్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుందని చెబుతున్నారు. ఇది వెయిట్ లాస్ కావడానికి బాగా సహకరిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ జ్యూస్ ను ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? దీని ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

Just drink this cucumber ginger juice to lose weight

కీర దోసను ఇలా జ్యూస్ చెయ్యాలి
బరువు తగ్గాలి అనుకునేవారు కీరా దోసకాయను, ఒక ఇంచ్ అల్లం ముక్కను, కాస్త నిమ్మరసాన్ని ఒక గ్లాసు నీళ్లతో కలిపి తయారు చేసుకోవాలి. కీరదోస తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి చిన్న అల్లం ముక్కను కూడా వేసి మిక్సీ జార్ లో మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. కీర దోసను తొక్క తీయకుండా కూడా వాడుకోవచ్చు. మెత్తని పేస్టులా మారిన తర్వాత అందులో నీళ్లు పోసి బ్లెండ్ చేసుకోవాలి.

ఫ్యాట్ బర్న్ చేసే కీరా దోస జ్యూస్
ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడగట్టి పిప్పి మొత్తాన్ని తీసేసి జ్యూస్ ను తాగాలి. ఆ జ్యూస్ ను నేరుగా కానీ, కొద్దిగా నిమ్మరసం కలుపుకొని కానీ తాగవచ్చు. కీరదోస అల్లం జ్యూస్ తాగడం వల్ల శరీరంలో జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ జ్యూస్ వల్ల జీవక్రియ కూడా బాగుంటుంది. ఇది మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

బరువు తగ్గాలంటే ఇది ట్రై చెయ్యండి
కీరదోస అల్లం జ్యూస్ శరీరానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది. కీరా దోసలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మనకు కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇది ఆహారం ఎక్కువగా తినకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది. మన శరీర బరువు తగ్గడానికి ఎంతగానో పనికొస్తుంది. కనుక బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు ఉదయం కీరదోస జ్యూస్ ను ట్రై చేయండి. ఇది మీకు కచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందని చెబుతున్నారు డైటీషియన్లు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+