Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బరువు తగ్గే, షుగర్ కంట్రోల్ లోకి వచ్చే మంచి డైటింగ్ విధానం ఇదే.. ట్రై చెయ్యండి

చాలామంది బరువు తగ్గడానికి కీటో డైట్ ను ఫాలో చేస్తూ ఉంటారు. కీటో డైట్ అంటే తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి, ఎక్కువ కొవ్వులు మరియు కొంత ప్రోటీన్లను కలిగి ఉన్న ఆహారం. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఇది కీటోసిస్ అనే ప్రక్రియకు దారితీస్తుంది. సహజంగా కీటో డైట్ బరువు తగ్గడం కంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

కీటో డైట్ తో డయాబెటిస్ కంట్రోల్
కీటో డైట్ యొక్క ఒక ముఖ్యమైన ప్రయోజనం రక్తంలో చక్కెర నియంత్రణ . కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. ఇది టైప్ 2 మధుమేహం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. కీటో డైట్ అనుసరించే అనేక మంది మెరుగైన మానసిక స్పష్టత మరియు దృష్టిని పొందినట్టు చెప్తారు.

ketodiet gives many health benefits diabetes control along with weight loss

శక్తికి, మెదడు ఉత్తేజానికి కీటో డైట్
మన మెదడు కీటోన్లను సమర్థవంతమైన ఇంధన వనరుగా ఉపయోగిస్తుంది. ఇది మెరుగైన జ్ఞాపకశక్తికి దారితీస్తుంది. ఇది మెదడుకు సంబంధించి ఏకాగ్రత సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ప్రత్యేకంగా సహాయపడుతుంది.కీటో డైట్ తీసుకోవడం వల్ల మరో ప్రయోజనం శక్తి స్థాయిలు పెరుగుతాయి. శరీరం శక్తి కోసం కొవ్వును కరిగించడానికి అనుకూలంగా మారినప్పుడు, చాలా మంది రోజంతా నిరంతర శక్తి పెరుగుదలను గమనిస్తారు.

ఈ ఆరోగ్య సమస్యలకు కీటో డైట్ తో ఉపశమనం
ఇది మెరుగైన శారీరక పనితీరును కనబరుస్తుంది. కీటో డైట్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీటో డైట్ మన శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ ను పెంచడంతోపాటు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడం, ట్రై గ్లిజరైడ్స్ ను తగ్గించడం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి శరీరంలో వచ్చే నొప్పులు మంటలను తగ్గించడానికి కీటో డైట్ దోహదం చేస్తుంది.

కీటో డైట్ పాటించాలంటే వైద్యుల సలహా తప్పనిసరి
కీటో డైట్ మన ఆకలిని తగ్గిస్తుంది. కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు కీటో డైట్ ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో రక్తంలో చక్కెరను నియంత్రించడంతో పాటు శక్తిని అందించడం వంటి ఫలితాలు ఉన్నాయి. మొత్తంగా కీటో డైట్ మన శరీరానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్య నిపుణుల సలహాలు లేకుండా కీటో డైట్ ను పాటించడం మంచిది కాదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+