శనగపిండి లేకుండా ఇన్స్టెంట్ గా చేసుకునే మినప జంతికలు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!

సంక్రాంతి పండుగకు దాదాపు అందరి ఇళ్లలోనూ పిండివంటలు ఘుమఘుమలాడతాయి. అయితే చాలామంది శనగపిండితో తయారు చేసిన పిండి వంటలు తినడానికి ఇబ్బంది పడతారు. శనగపిండితో తయారు చేసిన పిండి వంటలు కడుపు ఉబ్బరానికి దారితీస్తాయని, ఎసిడిటీకి, గ్యాస్ కు కారణమవుతాయని భావిస్తారు. అయితే అలాంటి సమస్య లేకుండా శనగపిండితో కాకుండా, మినప్పిండితో ఇన్స్టెంట్ గా తయారు చేసుకునే జంతికలు కొలతల ప్రకారం ఏవిధంగా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
మినప పిండి- ఒక కప్పు
బియ్యం పిండి- రెండు కప్పులు
వెన్న లేదా నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
వాము- ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్
నువ్వులు- ఒక టేబుల్ స్పూన్
ఉప్పు- తగినంత
నీరు- అవసరానికి సరిపడా
నూనె- జంతికలు వేపటానికి తగినంత

Know how to make instant Minapa Jantikalu without besan for this sankranthi

తయారీ విధానం
ఒక పెద్ద పాత్రలో మినప పిండి, బియ్యం పిండి, ఉప్పు, వాము, జీలకర్ర, నువ్వులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వెన్న కానీ నెయ్యి కానీ వేసి వేళ్ళతో ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ మరీ గట్టిగాను, మరీ పలుచగా లేకుండా జంతికల గొట్టంలో ఒత్తుకునే విధంగా పిండిని కలుపుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె వేడి చేసి మీడియం మంటపైన జంతికలు వేసుకోవాలి.

ఇలా చేస్తే జంతికలు క్రిస్పీగా, రుచిగా
పిండిని జంతికల గొట్టంలో నింపి స్టవ్ పైన కాలుతున్న నూనెలో వేయాలి. దీనిని నెమ్మదిగా తిప్పుతూ బంగారురంగు వచ్చేవరకు వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చిన తర్వాత నిదానంగా తీసి ఒక టిష్యూ పేపర్ పైన ఉంచాలి. ఇలా చేస్తే అదనంగా ఉన్న నూనె టిష్యూ పేపర్ కు పీల్చుకుంటుంది. జంతికలు బాగా రావాలంటే పిండిలో నెయ్యి లేదా వెన్న తప్పనిసరిగా వేయాలి. బాగా క్రిస్పీగా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతుంది.

ఇలా చేసి చూడండి.. ఈ జాగ్రత్తలతో వండండి
స్టవ్ బాగా హైలో పెట్టి నూనెను విపరీతంగా వేడి చేస్తే జంతికల రుచిలో మార్పు ఉంటుంది. కాబట్టి జంతికలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. పిండి చాలా పలుచగా లేదా గట్టిగా ఉండకుండా చూసుకోవాలి ఇలా తయారు చేసిన జంతికలను పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే 10 నుండి 12 రోజుల పాటు నిల్వ ఉంటాయి.

హ్యాపీగా పిండి వంటల రుచులతో పండుగ
శనగపిండిని ఉపయోగించకుండా మినప్పిండితో తయారుచేసిన ఈ జంతికలు రుచిలో సూపర్ గా ఉంటాయి. తినడానికి క్రిస్పీ గాను ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఈ సంక్రాంతి పండుగకి మినప్పిండి జంతికలు తయారు చేసుకోండి. కుటుంబ సభ్యులే కాదు, బంధువులకు పెట్టి పండుగను హ్యాపీగా పిండి వంటల రుచులతో చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+