సూపర్ టేస్టీ 'కుష్కా రైస్'.. ఇలా చేస్తే ముద్ద ముద్దకూ వావ్ అనాల్సిందే..!
ఎప్పుడూ ఒకేరకమైన వంటలు తిని బోర్ కొట్టిందా..? అయితే సూపర్ టేస్టీ కుష్కా రైస్ ను ఈజీగా తయారు చేసుకోండి. కుష్కా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేయాలి..? చూస్తే.. కుష్కా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు.. బాస్మతి బియ్యం రెండు కప్పులు, ఉల్లిపాయలు రెండు, పచ్చిమిర్చి నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్, పుదీనా ఆకులు అర కప్పు, కొత్తిమీర అర కప్పు, పెరుగు అర కప్పు, కారం ఒక టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.
అలాగే బిర్యానీ ఆకు ఒకటి, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క తీసుకోవాలి. ఇక వీటితోపాటు నెయ్యి నూనె కలిపి నాలుగు టేబుల్ స్పూన్ లు, నీళ్లు ముడున్నర కప్పులు తీసుకోవాలి. ఇక కుష్కా రైస్ తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యాన్ని కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె దాంతోపాటు నెయ్యి వేసి వేడి చేయాలి. అందులోనే మొత్తం స్పైసెస్ కూడా వేయాలి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అందులోనే పెరుగు, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత బియ్యం వేయాలి. అలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీరు, ఉప్పు వేసి మూతపెట్టి బాగా మరిగించుకోవాలి. ఇక చివరగా ఆ మిశ్రమంలోనే నిమ్మరసం వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ కుష్కా రైస్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications