తొక్కే కదా అని పారేయొద్దు.. 'తొక్క తీస్తుంది'
నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు ఉన్నా వెంటనే తగ్గిపోతాయి. నాన్ వెజ్ కూరలు తినేసమయంలో మనం నిమ్మకాయలను పిండుకొని తింటాం. ఎక్కువగా చికెన్ కూరలో నిమ్మకాయను పిండుకుంటారు చలువ చేస్తుందని. కాల్షియం, పొటాషియం కూడా నిమ్మకాయల్లో ఉంటాయి. నిమ్మరసమే కాదు.. తొక్కలవల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయి. జుట్టు, చర్మానికి వీటిని వాడొచ్చు.
నిమ్మ తొక్కల్ని ఇలా తీసుకోండి: నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి, పొడిచేసి గాలి చేరని సీసాలో దాయాలి. . కూరలు, స్మూతీలు, రోటి పచ్చళ్లు, సలాడ్స్, జ్యూస్ లలో వేసుకుంటే సి విటమిన్ కొరత రాకుండా ఉంటుంది.

చర్మంపై రుద్దండి: తొక్కలను చర్మంపై రుద్దితే మురికి పోతుంది. కాస్మొటిక్స్, సబ్బుల తయారీలో కూడా నిమ్మతొక్కల్ని వాడుతుంటారు. చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుంటుంది.
రక్త పోటు నియంత్రణలో ఉంటుంది: శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను కరిగిస్తాయి. నిమ్మతొక్కల పొడిని వాడితే కొలెస్ట్రాల్ తగ్గి.. బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా చూడటంలో వీటిది ప్రముఖ పాత్ర. రక్తపోటును కూడా తగ్గిస్తాయి.
ఎముకలు బలంగా ఉండాలంటే: నిమ్మ తొక్కలు ఎముకలను బలంగా ఉంచుతాయి. చర్మంపై ఉండే గడ్డలు, కాయలు వంటి వాటిని తొలగించడంలో నిమ్మతొక్కల పొడి ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
వాంతులు అవ్వవు: తొక్కల వాసన పీల్చితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. నిరాశగా ఉండేవారు నిమ్మతొక్కల వాసన చూస్తుండాలి. ప్రయాణ సమయంలో వీటి వాసన చూస్తే వాంతులు అవ్వవు.
క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది: నిమ్మతొక్కల పొడిని తీసుకుంటుంటే లిమోనిన్, సాల్వెస్ట్రాల్ క్యూ40 వంటి పోషకాలు.. క్యాన్సర్ కణాలతో పోరాడి.. ప్రాణాంతక వ్యాధిని అరికడతాయి.












Click it and Unblock the Notifications