ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.. ఈ ఒక్కటి తాగండి

శీతాకాలం వచ్చేసింది. దీంతోపాటు సీజనల్ వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయి. దగ్గు, జలుబు లాంటివి వస్తూనే ఉంటాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే అధిక శాతం మంది యాంటీ బయొటిక్స్, మందులు, సిరప్స్ ను వాడుతుంటారు. కానీ వాటివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకే ఇంట్లో దొరికేవాటితోనే ఒక డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఉపశమనం లభించడంతోపాటు ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

ఈ డ్రింక్ ను తయారుచేసుకోవడానికి పుదీనా ఆకులు, అల్లం, పసుపు కావాలి. ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. అందులో పది పుదీన ఆకులు వేయాలి. చిన్న అల్లం ముక్క కూడా వేసి వాటిని బాగా మరిగించాలి. ఈ నీటిని గోరువెచ్చగా అయ్యేవరకు ఉంచాలి. అనంతరం వడకట్టి గ్లాస్ లో పోసిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ తేనె కలుపుకొని తాగితే ఎటువంటి అనారోగ్యం దరికి రాదు.

lungs to be healthy take this drink

ఈ డ్రింక్ ను తీసుకోవడంవల్ల ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో ఎంతో తోడ్పడతాయి. ఇలా నీటిని తయారు చేసుకోవడంవల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. అవి కూడా శుభ్రపడతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. పిల్లలకు అర గ్లాస్, పెద్దలైతే ఫుల్ గ్లాస్ తాగొచ్చు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మరెన్నో ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఊపిరితిత్తులని క్లీన్ చేయడానికి కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్స్‌తో పాటు హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్‌ని తీసుకుంటుండాలి. అలాంటి ఆహారాలు తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+