మామిడిపండు.. ఆరోగ్య ప్రయోజనాలు మెండు.. కానీ!

వేసవికాలంలో దొరికే సీజనల్ పండు మామిడి పండు. మామిడి పండ్లను ఇష్టపడనివారు దాదాపు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పండ్లలో రారాజు గా ఉండే మామిడిపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇక మామిడి పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మామిడి పండ్లలో ఫుల్ పోషకాలు
మామిడి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి, బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ కారణంగా యాక్నె సమస్యలు లేకుండా ఉంటాయి. మామిడి ఇతర చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది. మామిడిపండ్ల తో చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.

mango gives huge health benefits know the super health benefits

మామిడితో ఆరోగ్య ప్రయోజనాలు
. చర్మంపైన ముడతలు తొలగిపోవడం మాత్రమే కాకుండా, చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మ ఆరోగ్యానికి మామిడి ఎంతో మేలు చేస్తుంది. మామిడి పండ్లలో బీటా కెరటిన్ పుష్కలంగా ఉంటుంది. మామిడి పండులో ఉండే విటమిన్ సి, ఫైబర్ కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మామిడి జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. మామిడి పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కారణంగా అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది.

మామిడి పండుతో శృంగార సమస్యలు దూరం
మామిడిపండులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మామిడి పండులో ఉండే పోషకాలు తల వెంట్రుకల కుదుళ్లకు మంచి పోషకాలను అందిస్తాయి. జుట్టు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మామిడి పండుతో శృంగార సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా పురుషులలో శృంగార సామర్థ్యాన్ని మామిడి పండ్లు పెంచుతాయి.

మామిడి పండ్లతో వ్యాధి నిరోధకశక్తి
మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి సమస్యలు దూరమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి . మామిడి పండ్లు వ్యాధి నిరోధక శక్తిని బాగా మెరుగుపరుస్తాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే మామిడి పండ్లను పరిమిత మోతాదులో తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. మితం లేకుండా తింటే ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+