ఈ శరీర భాగాలకు నూనెతో మసాజ్ చేస్తే రోగాలకు గుడ్ బై చెప్పినట్టే!!
మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం ఎన్నో చేస్తూ ఉంటాం. శరీర ఆరోగ్యంగా ఉండాలంటే క్రమబద్ధమైన జీవనశైలి ఎంతో అవసరం. ప్రతీరోజూ వ్యాయామం, మంచి పౌష్టిక ఆహారం తప్పనిసరిగా అవసరం. అంతేకాదు శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందించడం ఎంతో అవసరం. ఒక్కొక్కసారి ఆ పోషకాలు నూనెలలో కూడా ఉంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.
ఆహారంలో భాగంగా నూనె
మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు కొంత నూనె కూడా ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. నూనెలలో ఆలివ్ ఆయిల్ చాలా మంచిది మన ఆహారం వండుకోవడానికి ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ కొనుగోలు చేసి ఉపయోగించలేని వారు మీ బడ్జెట్లో దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ కూడా కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఇది కూడా మనకు ఆరోగ్యాన్నిస్తుంది.

ఆయిల్ శరీర భాగాలపై రాసినా ప్రయోజనమే
ఆహారంలో భాగంగా ఆయిల్ చేర్చుకోవడమే కాకుండా మన శరీరం పైన కూడా అనేక భాగాలలో నూనె రాస్తే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది.మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం నాలుగు భాగాలకు నూనె రాయడం చాలా అవసరం అని తెలుసుకోవాలి. తలకు నూనె రాయడం వల్ల మెదడు చల్లబడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. తలకు నూనె రాయడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
నూనె తో మసాజ్.. ఈ భాగాలకు నూనె రాస్తే ఆరోగ్యం
శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. తొందరగా పొడి బారదు. ఇక పడుకునే ముందు మోకాళ్ళ పైన నూనె రాస్తే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. చేతులకు నూనె రాయడం వలన చేతులు పొడిబారకుండా సాఫ్ట్ గా ఉంటాయి.
నూనె రాస్తే చాలా రోగాలకు చెక్
గోళ్ళపై నూనె రాయడం వల్ల గోళ్ళు పొడిబారవు .. అవి సాఫ్టు గా, తేమగా ఉండటమే కాకుండా గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు శరీరంలోని ఈ భాగాలకు నూనె రాయడం మర్చిపోకండి. ఇలా నూనె రాయడం వల్ల అనేక రకాల రోగాల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications