సూపర్ టేస్టీ 'మేథీ ఎగ్​ మసాలా'.. ఇలా ఈజీగా చేసుకోండి..!

మెంతికూర కాస్త చేదుగా ఉన్నా టేస్టు మాత్రం నెక్స్ట్ లెవల్ ఉంటుంది. చాలామంది ఈ మెంతి కూరను వారం వారం చేసుకుని ఇష్టంగా తింటుంటారు. ఇక మెంతి కూర కోడిగుడ్డు కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. మెంతి కోడిగుడ్డు కూరను ఇష్టపడని వారుండరు. ఈ కాంబినేషన్ అన్నంలోకి మాత్రమే కాదు చపాతీలోకి కూడా టేస్టీగానే ఉంటుంది. ఈ మెంతి కోడిగుడ్డు కూరను బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ కూర తయారీ విధానం.. కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇప్పుడు చూద్దాం..

మెంతి కోడిగుడ్డు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కోడిగుడ్లు నాలుగు, నూనె తగినంత, పసుపు పావు టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, ఉల్లిపాయలు రెండు, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి మూడు, అల్లం పేస్టు తగినంత, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, కారం తగినంత, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, మెంతికూర కట్టలు మూడు లేదా నాలుగు, టమాటోలు నాలుగు, గరం మసాలా చిటికెడు తీసుకోవాలి.

మెంతి కోడిగుడ్డు కూర తయారీ విధానం చూస్తే.. ముందుగా కోడిగుడ్లను ఉడికించుకోవాలి. ఇప్పుడు మెంతికూరను కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో తగినంత నూనె వేయాలి. నూనెలో గుడ్లు వేసి ఆ తర్వాత పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి.

MethiEggCurry Bachelor s Quick recipe Simple Steps to Make Fenugreek Leaves Egg Gravy in 30 Minutes

వాటిని పక్కకు తీసి ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర వేయాలి. అనంతరం ఉల్లిపాయ తరుగు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గించుకున్నాక పచ్చిమిర్చి, అల్లం పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, నీళ్లు పోసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మెంతికూర తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకూ మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో టమాటో పేస్టు వేసి ఉడికించుకోవాలి. చివరిలో గరం మసాలా వేస్తే సరి.. మేథీ ఎగ్​ మసాలా రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+