నోటి ఆరోగ్యమే.. శరీర ఆరోగ్యానికి ఆధారం..! ఈ విషయాలు తెలుసా..?
నోరు ఆరోగ్యంపైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నోరు ఆరోగ్యంగా ఉంటే మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు కృషి చేస్తుందని వివరిస్తున్నారు. పొద్దున్నే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత చాలామంది మౌత్ వాష్ తో నోరు పుక్కిలిస్తుంటారు. దంతాలు-చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి దుర్వాసనను దూరం చేయడానికి ఈ ప్రక్రియ బాగా తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు. నోటి ఆరోగ్యం సరిగా లేకపోతే ఇతర ప్రాణాంతక వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. అయితే నోటి ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి..? అని వైద్యులు వివరిస్తున్నారు.
నోరు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, కాఫీ వంటి వాటిని నివారించాలి. ప్రతిరోజూ ఆయిల్ పుల్లింగ్ ఫార్ములా ఉపయోగించాలి. విటమిన్ ఏ,డీ,ఈ,కే ఉన్న ఆహారాలు అలాగే సప్లిమెంట్స్ పై దృష్టి పెట్టాలి. లిక్విడ్ మినరల్ సప్లిమెంట్ అలాగే మెగ్నిషియం తీసుకోవాలి. సహజమైన, యాంటీమైక్రోబియల్ టూత్ పేష్ట్ వాడాలి. పాత ఫిల్లింగ్స్, రూట్ కెనాల్స్ సరిచేయడానికి నిపుణులైన దంత వైద్యులను సంప్రదించాలి. ప్రతి రోజూ బ్రష్ చేయడంతో పాటుగా ప్లాస్ చేయాలి.. అని వైద్యులు వివరిస్తున్నారు.

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా ఆహారంతోపాటుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ బ్యాక్టీరియా పేగులకు చేరి జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అలాగే పళ్లను శుభ్రంగా తోముకోకపోతే.. లీకీ గట్ సిండ్రోమ్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. నోటి పూత, చిగుళ్లు వాపు, రక్తస్రావం, దంతక్షయం వంటివి సంభవిస్తాయని వివరిస్తున్నారు. నోటి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోతే గుండె, మెదడు.. ఇలా మొత్తం ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications