మునగాకు పప్పు ఇలా చేసి తింటే ఆరోగ్యం.. రుచి కూడా అద్భుతం!
ఆరోగ్యంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. అలా ఆరోగ్యం కోరుకునేవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో పప్పు మన శరీరానికి కావలసిన ప్రోటీన్ ను అందిస్తుంది. ఇక పప్పు తో పాటు మునగాకును కలిపి మునగాకు పప్పు వండుకుని తింటే వంద రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మనం రుచికరమైన, ఆరోగ్యాన్ని ఇచ్చే మునగాకు పప్పును ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం.
మునగాకు పప్పు తయారీ కి కావలసిన పదార్థాలు
కందిపప్పు - 1 కప్పు
మునగాకు - 2 కప్పులు (శుభ్రంగా కడిగి తరిగినవి)
ఉల్లి - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2
టమాట - 1 ( ఇష్టం ఉంటేనే)
వెల్లుల్లి - 5-6 రెబ్బలు
చింతపండు - ఉసిరికాయంత
పసుపు - ½ టీస్పూన్
కారం- రుచికి తగినంత
ఉప్పు - తగినంత
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - ½ టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
ఎండు మిర్చి - 1-2
కరివేపాకు - కొద్దిగా
ఇంగువ - చిటికెడు

తయారీ విధానం
కుక్కర్లో కందిపప్పు , తుంచి శుభ్రంగా కడుక్కున్న మునగాకును, కట్ చేసుకున్న టమాటా ముక్కలను, కొద్దిగా చింతపండును వేసి స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్ విజిల్ వదిలే వరకు ఉండి పప్పును మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి, మళ్లీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి.
ఇలా చేస్తే మునగాకు పప్పు సూపర్
ఒక పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె, రెండు ఎండు మిరపకాయలు, పోపుగింజలు వేసి, ఆపై అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి, తర్వాత కరివేపాకు, కాస్త ఇంగువ వేసి పోపును పప్పులో కలపాలి. పప్పు కొద్దిగా పోపుతో కలిసి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన మునగాకు పప్పు రెడీ అయింది. ఈ పప్పును మనం అన్నంతో కానీ, చపాతీ తో కానీ, జొన్న రొట్టెతో కాని కలిపి తింటే చాలా బాగుంటుంది.
-
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
నయా స్టైల్ లో ఎగ్ మసాలా కర్రీ.. ఇదొక్కడి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications