పెసరపప్పు సూప్.. బెస్ట్ వెయిట్ లాస్ టెక్నిక్..!
పెసరపప్పు సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పు సూప్ తేలికగా జీర్ణం కావడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను సైతం అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకొనేవారికి మంచి ఆహారం అని చెప్పొచ్చు. మరి బెస్ట్ వెయిట్ లాస్ టెక్నిక్ గా భావించే 'పెసరపప్పు సూప్' తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..?
పెసరపప్పు సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెసరపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ ఒకటి చిన్నది, తోటకూర కొద్దిగా, టమాటో ఒకటి చిన్నది, శనగపిండి ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి 2 రెబ్బలు, జీలకర్ర 1/2 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె తగినంత తీసుకోవాలి.
పెసరపప్పు సూప్ తయారీ విధానం చూస్తే.. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, తోటకూర, టమాటో, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడి చేసుకోవాలి. జీలకర్ర వేయించి, ఆ తర్వాత ఉల్లిపాయ వేయించుకోవాలి. ఉల్లిపాయ తర్వాత, వెల్లుల్లి వేసి త్వరగా వేయించి, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి.

ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పును నీటితో కలిపి వేసి మెత్తగా కలపాలి. అందులో టమాటో మిశ్రమానికి కలపండి. తగినంత నీరు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. పప్పు మెత్తగా మరిగిన తర్వాత, శనగపిండిని నీటిలో కలిపి సన్నగా పోస్తూ సూప్‌కు సాంబార్ రుచి వచ్చే వరకు మగ్గించాలి. చివర్లో కొత్తిమీర తరుగు వేస్తే సరి.. సూపర్ టేస్టీ పెసరపప్పు సూప్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications