ఆవాలే కదా అని తీసి పారెయ్యకండి.. వీటి అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు!

మన ఇళ్లల్లో దొరికే అనేక పదార్థాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అటువంటి వాటిలో ఆవాలు ఒకటి. ఆవాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన క్యాల్షియం, ఫైబర్, రాగి, విటమిన్ లను అందిస్తాయి. ఆవాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఆవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆవాలు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఆవాల గింజలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆవాల గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణక్రియ పెరుగుతుంది. ఆవాలను ఆహారంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఆవాలలో ఉండే అధిక ఫైబర్ మలవిసర్జనను సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాగే ఆవాలలో ఉండే ఎంజైములు శరీర కార్యకలాపాలను మెరుగుపరిచి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి.

Mustard seeds have many health benefits amazing results if you eat mustard seeds

అవాలతో గుండెపోటుకు, చెడు కొలెస్ట్రాల్ కు చెక్
ఆవాలు మన హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆవాలు గింజలను తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివలన మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది ధమనులలో కొవ్వు పేరుకు పోవడాన్ని నిరోధిస్తుంది. ఆవాలు హృదయ వ్యాధులను తగ్గిస్తాయి. గుండెపోటు బారి నుంచి మనల్ని కాపాడతాయి. ఆహారంలో ఆవాలను భాగంగా చేసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలపడతాయి.

ఎముకలకు, చర్మానికి ఆవాలతో మేలు
శరీరానికి కావలసిన సెలీనియం లభిస్తుంది. దీనివల్ల ఎముకల సాంద్రత మెరుగుపడుతుంది. దంతాల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆవాలు దంతాల నొప్పులను తగ్గించి చిగుళ్ల వాపులను నివారించి దంతాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఇక ఆవాలు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. మన చర్మాన్ని తేమగా ఉంచేలా చేస్తాయి. ఆవాల గింజలను తీసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మ రంద్రాలలో పేరుకుపోయిన మురికిని ఆవాలు తొలగిస్తాయి.

జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా
ఆవాలలో ఉన్న విటమిన్లు, ఖనిజాలు చర్మానికి పోషణను అందిస్తాయి. అలాగే చర్మం వాపును, ఎరుపును తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల చర్మం సాఫ్ట్ గాను ముడతలు లేకుండా ఉంటుంది. ఆవాలు మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆవాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లతోపాటు కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఇవి జుట్టు ప్రకాశవంతంగానూ ఆరోగ్యంగాను పెరిగేలా చేస్తాయి.

ఆవాలతో అద్భుతమే జరుగుతుంది
ఆవాలతో తెల్ల జుట్టు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జుట్టు రాలే సమస్యల నుంచి కూడా ఆవాలు ఉపశమనం కలిగిస్తాయి. మొత్తంగా ఆవాలు చూడడానికి చిన్నగానే అనిపించిన మన శరీరానికి అవి పెద్ద ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. కనుక ఆవాలను చిన్నచూపు చూడొద్దు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+