'నాన్​ స్టిక్' పాత్రలు వాడకంపై వైద్యులు ఏం చెబుతున్నారు..?

ప్రస్తుతం పతి ఇంట్లో నాన్ స్టిక్ వంట గిన్నెలు వాడుతున్నారు. నాన్ స్టిక్ లో కూరగాయలు మాడిపోవడం, రుచి తగ్గిపోవడం జరగదు. అలాగే ఈ పాత్రలు శుభ్రం చేసుకోవడానికి కూడా సులువుగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారు. అయితే నాన్ స్టిక్ పాన్ లు వాడడం అంత మంచిది కాదని వైద్యలు చెబుతున్నారు.

నాన్ స్టిక్ ప్యాన్‌ ల మీద పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే పదార్థంతో పూత పూసి ఉంటుంది. ఆహారం అంటకుండా, వేడిని తట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే టెఫ్లాన్ నేరుగా క్యాన్సర్ కారకం కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ PTFE పెర్ఫ్లో రోక్టానోయిక్ యాసిడ్ (PFOA)తో సహా విషపూరిత పొగలను విడుదల చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ పొగలు "పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్" అని పిలిచే ఫ్లూ లాంటి లక్షణాలకు దారితీయవచ్చని చెబుతున్నారు.

Non-Stick Nightmares The Health Truth Behind Your Favorite Kitchen Utensils

టెఫ్లాన్​ PFOA వాడిన పాన్​లను ఉపయోగిస్తే లివర్, కిడ్నీ, టెస్టిస్ క్యాన్సర్లు, థైరాయిడ్ పనితీరు, పిల్లల్లో ఎదుగుదల వంటి వాటిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక పాన్ లపై కోటింగ్ ఆహారంలో కలిసి జీర్ణ సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నాన్ స్టిక్ ప్యాన్‌ లకు ప్రత్యామ్నాయంగా స్టెయిన్​ లెస్ స్టీలు, సిరామిక్, మట్టితో తయారు చేసినవి వాడడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+