obesity control tips: బరువు బాగా పెరిగారా? అయితే ఇలా తగ్గండి!!
చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గినట్టే తగ్గి మళ్లీ మళ్లీ బరువు పెరుగుతున్నారు. ఇది ప్రస్తుతం సమాజంలో అనేకమంది రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య. అయితే బరువు ఎందుకు పెరుగుతున్నారు? బరువుని ఎప్పుడూ అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
బరువు తగ్గాలంటే నీళ్ళు తాగాలి
సహజంగా బరువు పెరగడం జీవనశైలి సరిగ్గా లేకపోవడం, క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమకు దూరంగా ఉండటం వంటి కారణాలతో జరుగుతుంది. కాబట్టి కొన్ని చిన్న చిన్న విషయాలపైన మనం దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకుంటే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక వాటిలో ముఖ్యమైనది నీటిని పుష్కలంగా తాగడం. చాలామంది సరిగ్గా నీరు తాగరు. మన శరీరానికి కావలసినంత నీటిని కచ్చితంగా తీసుకోవాలి.

బరువు తగ్గాలంటే ఈ ఆహారం తినాలి
భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీటిని తాగాలి. ఇది మీ ఆకలిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఇక బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉండే ఆహారం కాకుండా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం మిమ్మల్ని బరువు పెరగకుండా ఆపుతుంది. కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గాలంటే నిద్ర పోవాలి
ఇదే సమయంలో తినే ఆహారాన్ని నియమిత సమయంలో, మితంగా తీసుకోవడం మంచిది. అతిగా తినడం లేక అతి తక్కువగా తినడం రెండు మీ బరువు పైన ప్రభావం చూపిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు నిద్రపైన కూడా శ్రద్ధ పెట్టాలి. సరైన నిద్ర లేకపోతే హార్మోన్ల అసమతులత ఏర్పడుతుంది. దీనివల్ల బరువు పెరుగుతారు కాబట్టి ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే బరువు కంట్రోల్లోకి వస్తుంది.
బరువు తగ్గాలంటే ఈ పనులు చెయ్యాలి
బరువు తగ్గాలనుకునే వారు శారీరక శ్రమ చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కనీసం రోజుకి అరగంటపాటైన వ్యాయామం చేస్తే కాస్త ప్రయోజనం ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్లు, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తీసుకోవడం మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. అప్పుడే బరువు తగ్గించుకోవడం ఈజీ అవుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications