బెండకాయ కోడిగుడ్డు పులుసు.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
కోడిగుడ్డులో అనేక పోషక విలువలు ఇన్నాయి. గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు (A, D, B12), ఖనిజాలు సమృద్దిగా లభిస్తాయి. గుడ్లు తినడం వల్ల కండరాల పెరుగుదల, మెదడు పనితీరు, కంటి చూపు మెరుగుపడటం, బరువు నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గుడ్డుతో ఇప్పటికే రకరకాల వంటలు చేసుకున్నారు. మరి బెండకాయ కోడిగుడ్డు పులుసు కూరను ఎప్పుడైనా విన్నారా..? సూపర్ టేస్టీ బెండకాయ కోడిగుడ్డు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఇక్కడ చూడండి.
సూపర్ టేస్టీ బెండకాయ కోడిగుడ్డు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బెండకాయలు అర కిలో, ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు, కోడిగుడ్లు నాలుగు, పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు, టమాటో ముక్కలు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి, గరం మసాలా, నూనె తగినంత, ఉప్పు చిటికెడు తీసుకోవాలి.
ఇక బెండకాయ కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూస్తే.. ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో రెండు స్పూన్ ల నూనె వేయాలి.

నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. అందులో బెండకాయ ముక్కలు, ఉడికించిన గుడ్లు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో కారం, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో కొత్తిమీర తరుగు వేసుకుంటే సరి. సూపర్ టేస్టీ బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications