ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ "పనీర్ టిక్కా".. ఎలా చేయాలంటే ??
భారతీయ శాకాహార వంటకాల్లో పనీర్ (Paneer) ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీనిని 'ఇండియన్ కాటేజ్ చీజ్' అని కూడా పిలుస్తారు. ప్రోటీన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే పనీర్, ముఖ్యంగా మాంసాహారం తీసుకోని వారికి అద్భుతమైన శక్తిని ఇచ్చే ఆహారం. పనీర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే.. దీనికి సొంతంగా బలమైన రుచి లేకపోయినా, మనం చేసే గ్రేవీ లేదా మసాలాల రుచిని పూర్తిగా పీల్చుకుని వంటకానికి ఒక అద్భుతమైన రూపాన్ని, రుచిని అందిస్తాయి.
అలానే పనీర్‌తో చేసే వంటకాల్లో 'పనీర్ బటర్ మసాలా', 'పాలక్ పనీర్' ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇవే కాకుండా పచ్చి బఠానీలతో చేసే మటర్ పనీర్, కొంచెం స్పైసీగా ఉండే కడాయి పనీర్, షాహీ పనీర్ వంటి వంటకాలు విందు భోజనాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మెయిన్ కోర్స్ వంటకాలే కాకుండా పనీర్ స్టార్టర్స్, స్నాక్స్ రూపంలో కూడా విశేషంగా అలరిస్తుంది. పెరుగు, మసాలాలతో మాగ్నెట్ చేసి గ్రిల్ చేసే 'పనీర్ టిక్కా' పార్టీలకు ప్రాణం పోస్తుంది. అందుకే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచి ఇచ్చేలా ఈ టేస్టీ వంటకం ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావలసిన పదార్థాలు:
- పనీర్: 200-250 గ్రాములు (దట్టమైన ముక్కలుగా కోసుకోవాలి)
- హంగ్ కర్డ్ (నీరు లేని పెరుగు): 1/2 కప్పు
- శనగపిండి: 1-2 టేబుల్ స్పూన్లు (వేగించినది)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
- కారం, పసుపు, గరం మసాలా: తగినంత
- కసూరి మేతి, నిమ్మరసం: కొద్దిగా
- ఉల్లిపాయ, క్యాప్సికమ్: ముక్కలుగా కోసినవి
- నూనె/వెన్న: కాల్చడానికి
తయారీ విధానం:
మ్యారినేషన్:
ఒక గిన్నెలో పెరుగు, శనగపిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, నిమ్మరసం, కసూరి మేతి, నూనె, ఉప్పు వేసి బాగా కలపాలి.
కలపడం:
ఈ మిశ్రమంలో పనీర్ ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి, మసాలా అంతా పట్టేలా మెల్లగా కలిపి, 30-60 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి.
కాల్చడం (Tawa Method):
పెనంపై నూనె వేడి చేసి, మ్యారినేట్ చేసిన ముక్కలను పెట్టి, మధ్యస్థ మంటపై అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చాలి.
చిట్కాలు:
పెరుగులో నీరు ఉంటే పనీర్ మెత్తబడిపోతుంది, కాబట్టి హంగ్ కర్డ్ వాడటం మంచిది.
ఓవెన్‌లో అయితే 230°C వద్ద 10-12 నిమిషాలు గ్రిల్ చేయాలి.
స్మోకీ ఫ్లేవర్ కోసం, చివర్లో బొగ్గును వెలిగించి నెయ్యి వేసి పొగ పట్టించవచ్చు.
పుదీనా చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయండి.












Click it and Unblock the Notifications