Passion Fruit: ప్యాషన్ ఫ్రూట్స్ గురించి మీకు తెలుసా..? వీటిలో ఆ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయ్..
Health News: శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో పండ్ల పాత్ర ఎనలేనిది. ఇవి కేవలం విటమిన్లతో నిండి ఉండటమే కాకుండా వివిధ రకాల జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఫ్రూట్స్ అనగానే ఆపిల్, దానిమ్మ, మామిడి, అరటి వంటి రోజువారీ పండ్లు గుర్తుకు వస్తాయి. అయితే వీటికి భిన్నంగా వేలాది రకాల పండ్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనకు తెలియదు కూడా. అటువంటి వాటిలో ఒకటే ప్యాషన్ పండు.
ప్యాషన్ ఫ్రూట్ మందంగా, ముడతలతో కూడి ఉంటుంది. దక్షిణ అమెరికాలో పుట్టిన ఈ ఫలం ఇతర ప్రాంతాల్లోనూ పెరుగుతుంది. ఇది రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని వైద్యులు చెబుతున్నారు. దీనిలోపల జెల్లీ తరహా గుజ్జు మరియు గింజలు ఉంటాయి. కొందరు వివిధ వంటకాలలోనూ విరివిగా వినియోగిస్తారు. పండుగా తినడంతో పాటు జ్యూస్, డెసర్ట్‌లలో జోడించడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

విటమిన్ Cతో నిండి ఉండే ప్యాషన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్త నాళాలు, మృదులాస్థి, కండరాలు మరియు కొల్లాజెన్‌కు దన్నుగా నిలుస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతో పాటు శరీర రుగ్మతలను సమర్థవంతంగా నయం చేస్తుంది. వాపును తగ్గిస్తూ, కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. తగినంత విటమిన్ C అందిస్తూ జలుబు మరియు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
ప్యాషన్ ఫ్రూట్ గుజ్జు మరియు కరకరలాడే గింజలు రోజువారీ అవసరమైన విటమిన్ Aలో 8 శాతాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కళ్లు మరియు కణాలు, పునరుత్పత్తి, రోగనిరోధక శక్తికి ఇది ఎంతో అవసరం. ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ పండు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్, మధుమేహం, గుండె జబ్బులు మరియు పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండటంతో జీర్ణక్రియ మెరుగుదలకు మద్దతు ఇస్తుంది. వీటికి అదనంగా ప్యాషన్ ఫ్రూట్‌లో గుండె ఆరోగ్యానికి మేలు చేసే యాంటిఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం మరియు ఫోలేట్‌లను కూడా ఇది అందిస్తుంది. మూత్రపిండాలు, నరాలు, కండరాలు మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతుంది.
పండు మాత్రమే కాకుండా సీడ్స్ కూడా పలు కీలక పోషక విలువలను కలిగి ఉన్నాయి. ఫైబర్, ప్రోటీన్, ఖనిజ లవణాలతో పాటు హృదయారోగ్యానికి దన్నుగా నిలిచే కొవ్వులు వీటిలో ముఖ్యమైనవి. రక్త నాళాలను విశాల పరచడంలో ఈ ఫ్రూట్ ఎంతగానో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంత ఆరోగ్యకరమైన పండు తినేటప్పుడు జాగ్రత్త వహించడం కూడా ముఖ్యం. ఎందుకంటే వీటిలో పల్ఫ్‌లో సైనోజెనిక్ గ్లైకోసైడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది సహజ టాక్సిన్ కాగా ఎక్కువ మోతాదులో సైనెడ్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి చిన్న, పూర్తిగా పండని ఫ్రూట్స్ తినడం సురక్షితం కాదు.












Click it and Unblock the Notifications